నమామి దేవి నర్మదే మహోత్సవ్‌లో మోదీ
Sakshi Education
69వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు.
నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా(138.68 మీటర్లు) నిండిన సందర్భంగా కేవాడియాలో చేపట్టిన ‘నమామి దేవి నర్మదే మహోత్సవ్’లో ఆయన పాల్గొన్నారు. 2017లో డ్యామ్ ఎత్తు పెంచాక పూర్తిగా నిండటం ఇదే తొలిసారి. అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పటేల్ విగ్రహాన్ని, బటర్‌ఫ్లై పార్కును సందర్శించిన మోదీ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. కాషాయ రంగులో ఉండే ‘టైగర్ బటర్‌ఫ్లై’ని గుజరాత్ రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నమామి దేవి నర్మదే మహోత్సవ్
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కేవాడియా, గుజరాత్
ఎందుకు : నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా నిండిన సందర్భంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : నమామి దేవి నర్మదే మహోత్సవ్
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కేవాడియా, గుజరాత్
ఎందుకు : నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా నిండిన సందర్భంగా
Published date : 18 Sep 2019 06:25PM