Skip to main content

నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు.
ఢిల్లీలో నవంబర్ 11న జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రమంత్రికి బుగ్గన వివరించారు. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రెవెన్యూ లోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని బుగ్గన నివేదించారు.

గత ప్రభుత్వం తీసుకున్న అప్పులను 2021 నుంచి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేంద్రమంత్రికి బుగ్గన వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చేయాల్సిన అప్పులను కూడా గత సర్కారే తీసుకోవడమే కాకుండా రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మిగిల్చి దిగిపోయిందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రమంత్రికి వివరించేందుకు
Published date : 12 Nov 2019 05:36PM

Photo Stories