నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘నిర్భయ్’ను భారత్ ఏప్రిల్ 14 విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో ఉన్న సమీకృత పరీక్షా వేదిక (ఐటీఆర్) నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ పరీక్షను చేపట్టింది. 42 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని నిర్భయ్ ఛేదించింది. ఈ క్షిపణి 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. శత్రువుల రాడార్లకు ఆచూకీ దొరకకుండా ఉండేందుకు నేల నుంచి కేవలం 100 మీటర్ల ఎత్తులో పయనిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్, ఒడిశా
క్విక్ రివ్యూ :
ఏమిటి : నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్, ఒడిశా
Published date : 16 Apr 2019 05:59PM