Skip to main content

నిర్భయ దోషి రివ్యూ పిటిషన్ కొట్టివేత

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Current Affairsఅక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను డిసెంబర్ 17న జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్‌కు మరణశిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు వెలువరించింది. 2018, జులై 9న ఈ కేసులో మరో ముగ్గురు దోషులు ముఖేష్, పవన్‌గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ కొట్టివేత
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని
Published date : 19 Dec 2019 06:05PM

Photo Stories