Skip to main content

నిర్భయ దోషి ముఖేష్ క్షమాభిక్ష తిరస్కరణ

2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17న తిరస్కరించారు.
Current Affairsఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ జనవరి 17న రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు...
ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. దోషులను 2020, ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉంది. అయితే ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు.
Published date : 18 Jan 2020 06:00PM

Photo Stories