Skip to main content

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో ఏపీ సీఎం భేటీ

నీతి ఆమోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందంతో బృందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు.
అమరావతి సచివాలయంలో సెప్టెంబర్ 13న జరిగిన ఈ సమావేశంలో రంగాల వారీగా రాష్ట్రం పరిస్థితిని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలని రాజీవ్‌కుమార్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెవిన్యూ లోటు కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని రాజీవ్ కుమార్ చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నీతి ఆమోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Sep 2019 05:33PM

Photo Stories