Skip to main content

నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం పొడిగింపు

నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడి గిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో 2021 జూన్ 30 వరకు నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కొనసాగనున్నారు. 1980లో ఐఏఎస్‌కు ఎంపికైన అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. 2018లోనే ఆయన పదవీకాలం ముగియగా.. 2019 జూన్ 30 వరకు పొడగిస్తూ అప్పటి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి రెండేళ్ల పాటు పొడిగించారు.

అమితాబ్ నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టకముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్టియ్రల్ పాలసీ అండ్ ప్రమోషన్) కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ విభాగాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌గా పిలుస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేబినెట్ నియామకాల కమిటీ
Published date : 27 Jun 2019 05:52PM

Photo Stories