Skip to main content

నీటి అణువిద్యుత్ కేంద్రానికి నామకరణం

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ రూపొందించిన ఈ అణు కేంద్రానికి సెప్టెంబర్ 16న ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’గా నామకరణం చేశారు. దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు. తాజాగా ఈ అణు కేంద్రం తన గమ్యస్థలాన్ని చేరుకుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ రియాక్టర్ ద్వారా చుకోట్కాలోని లక్ష మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయొచ్చు. 2019 ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు.

ది అకడెమిక్ లొమొనోసొవ్ ప్రత్యేకతలు
బరువు :
21 టన్నులు
ఎత్తు : 470 అడుగులు
పొడవు : 144 మీటర్లు
ప్లాట్‌ఫారమ్ : 30 మీటర్లు
అణు కేంద్రంలోని రియాక్టర్లు : 2
రియాక్టర్ల సామర్థ్యం : 35 మెగావాట్లు
Published date : 17 Sep 2019 05:39PM

Photo Stories