నీరవ్ మోదీ స్విస్ బ్యాంకు ఖాతాల స్తంభన
Sakshi Education
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ను దాదాపు రూ. 13వేల కోట్ల మేరకు మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన సోదరి పూర్విలకు చెందిన 4స్విస్ బ్యాంకు ఖాతాలను స్విట్జర్లాండ్ అధికారులు స్తంభింపజేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ఆ ఖాతాలను స్తంభింపజేశామని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. స్తంభనకు గురైన ఖాతాల్లో కలిపి మొత్తంగా రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఆ డబ్బంతా భారత్‌లో ఆర్థిక నేరంతో సంబంధం ఉన్నదేనని ఈడీ తమకు తెలిపిందన్నారు. అయితే వారి ఖాతాలు స్విట్జర్లాండ్‌లోని ఏ బ్యాంకులో ఉన్నాయో తెలియరాలేదు.
మరోవైపు నీరవ్ కేసుపై జూన్ 27న విచారణ జరిపినబ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జూలై 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 2019, మార్చిలో అరెస్టయిన నీరవ్ ఇప్పటికే వాండ్‌సవర్త్ జైలులో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీరవ్ మోదీ స్విస్ బ్యాంకు ఖాతాల స్తంభన
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : స్విట్జర్లాండ్ అధికారులు
ఎందుకు : భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు

Published date : 28 Jun 2019 06:16PM