Skip to main content

నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఎంపికైన వారు?

నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఎంపికయ్యారు.
Current Affairs ఈ విషయాన్ని అవార్డు సెలక్షన్‌ కమిటీ ఏప్రిల్‌ 20న వెల్లడించారు. నేషనల్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ప్రతి ఏటా ఢిల్లీలో నవంబర్‌లో జరిగే జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ న్యాయశాస్త్ర నైపుణ్యాన్ని స్వశక్తితో మరింత అభివృద్ధి చేసుకుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా రాణిస్తున్నారని అవార్డు సెలక్షన్‌ కమిటీ ప్రశసించింది. నగర పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్‌ శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో ప్రజలకు భరోసా కల్పించడంలో సఫలీకృతమయ్యారని కమిటీ కొనియాడింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఎంపికైన వారు?
ఎప్పుడు: ఏప్రిల్‌ 20
ఎవరు : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌
ఎందుకు : విధుల నిర్వహణలో విశేష ప్రతిభకనబరిచినందుకు
Published date : 21 Apr 2021 07:10PM

Photo Stories