నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రం
Sakshi Education
ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌కు తరలించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) నిర్ణయించింది.
ఈ మేరకు భారతీయ భాషా కేంద్రీయ సంస్థ (సీఐఐఎల్)కు సెప్టెంబర్ 5న ఆదేశాలు జారీ చేసింది. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తరలించే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల చర్చించారు. అనంతరం అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి యార్లగడ్డ లేఖ రాశారు.
Published date : 09 Sep 2019 05:49PM