నేవీలో మొదటి మహిళా పైలట్‌గా శివాంగీ
Sakshi Education
భారత నావికాదళానికి చెందిన సబ్-లెఫ్టినెంట్ శివాంగీ నావికా దళ పైలట్ అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
కేరళలోని కొచ్చిలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె డిసెంబర్ 2న పైలట్‌గా విధుల్లో చేరారు. శివాంగీతో పాటు 7వ డోర్నియర్ కన్వర్జన్ కోర్సుకు చెందిన మరో ఇద్దరు అధికారులు కూడా డోర్నియర్ పైలట్లుగా క్వాలిఫై అయినట్లు రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు. దీనిపై శివాంగీ స్పందిస్తూ తొలి మహిళా పైలట్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని, ఇదో కొత్త అనుభూతి అని పేర్కొన్నారు. దీనికోసమే ఎంతోకాలంగా ఎదురు చూసినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతనావికా దళ పైలట్ అయిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సబ్-లెఫ్టినెంట్ శివాంగీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతనావికా దళ పైలట్ అయిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సబ్-లెఫ్టినెంట్ శివాంగీ
Published date : 03 Dec 2019 06:18PM