Skip to main content

నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ విడుదల

దేశవ్యాప్తంగా డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు వ్యవస్థను రూపొందించాలని భావిస్తుంది. తద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకే క్లిక్‌తో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల దేశంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకేచోట నిక్షిప్తం చేసే అవకాశముంది. అందుకోసం నవంబర్ 10న ‘నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్’ను విడుదల చేసింది. ఈ బ్లూప్రింట్ నివేదికను ప్రజల అవగాహన కోసం అందుబాటులోకి తెచ్చింది.

జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రకారం అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ డిజిటల్ హెల్త్ ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దీనివల్ల ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఆన్‌లైన్‌లో వారు అంతకు ముందు పొందిన వైద్య చికిత్సలు, పరీక్షలు అన్నీ ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగుల వివరాలను నేషనల్ డిజిటల్ హెల్త్ వ్యవస్థలో పొందుపరచాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ విడుదల
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఎందుకు : దేశవ్యాప్తంగా డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని
Published date : 11 Nov 2019 06:01PM

Photo Stories