నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సభ్యుడిగా డాక్టర్ ఇండ్ల
Sakshi Education
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
మానసిక వైద్య విభాగం నుంచి సభ్యునిగా నియమిస్తూ ఎన్‌బీఈ డెరైక్టర్ డాక్టర్ రశ్మీకాంత్ దవే జారీ చేసిన నియామక పత్రాలు తనకు అందినట్లు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తెలిపారు. ఆయన విజయవాడలోని విమ్‌హాన్స్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 22న మీడియాతో మాట్లాడుతూ దేశంలో వైద్య నిపుణుల కొరతను తీర్చేందుకు ఎన్‌బీఈ కృషి చేస్తుందన్నారు. వైద్య విద్యార్థుల పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాలు, ప్రాక్టికల్స్ వంటి విషయాలపై బోర్డు సమీక్ష నిర్వహిస్తుందన్నారు.
Published date : 23 Feb 2019 03:30PM