నెచిపూ టన్నెల్‌కు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ టన్నెల్‌ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
Sakshi Education
లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో బోర్డర్ రోడ్‌స ఆర్గనైజేషన్ నిర్మించిన 44 నూతన వంతెనలు ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 12న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ 44 వారధులను ప్రారంభించారు. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం ‘నెచిపూ టన్నెల్’ నిర్మాణానికి ఆయన ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఒక వైపు పాక్, మరో వైపు చైనా...
వంతెనల ప్రారంభం అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ‘తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాకిస్తాన్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయి’ అని అన్నారు. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నెచిపూ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం

Published date : 13 Oct 2020 07:11PM