నౌకాదళ అమ్ములపొదిలోకి చేరిన అత్యాధునిక యుద్ధ విమానం?
Sakshi Education
దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానం ‘పొసిడాన్ 8ఐ(పీ8ఐ)’ భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరింది. అగ్రరాజ్యం అమెరికా రూపొందించిన ఈ విమానం నవంబర్ 18న గోవాలోని ఐఎన్‌ఎస్ హన్స నౌకా స్థావరంలో దిగింది.
ఒప్పందం ప్రకారం... అమెరికా, భారత్‌కు అందించాల్సిన నాలుగు పీ8ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. మిగిలిన మూడు పీ8ఐ విమానాలు 2021 ఏడాదికి సిద్ధమవుతాయి. ఈ నాలుగు విమానాల తయారీకి సంబంధించి 2016 జులైలో అమెరికా రక్షణశాఖ, బోయింగ్ కంపెనీతో 1.1 బిలియన్ డాలర్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే భారత్ వద్ద 8 పీ8ఐ విమానాలు ఉన్నాయి.
పొసిడాన్ 8ఐ విశేషాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరిన అత్యాధునిక యుద్ధ విమానం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పొసిడాన్ 8ఐ(పీ8ఐ)
ఎక్కడ : ఐఎన్‌ఎస్ హన్స నౌకా స్థావరం, గోవా
ఎందుకు : భారత సముద్ర నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
పొసిడాన్ 8ఐ విశేషాలు...
- అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రోఆప్టిక్ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సాయంతో శత్రు జలాంతర్గాములను దూరం నుంచే ఆయుధాలతో విరుచుకుపడటం ఈ విమానాల ప్రత్యేకత.
- 907 కి.మీ గరిష్ట వేగంతో, 1,200 నాటికల్ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో, ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యంతో ఈ విమానాలు నౌకా దళానికి కీలకంగా మారాయి.
- హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. అలాగే లద్దాఖ్ ప్రాంతంలో గస్తీ కోసమూ వీటిని రంగంలోకి దింపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరిన అత్యాధునిక యుద్ధ విమానం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పొసిడాన్ 8ఐ(పీ8ఐ)
ఎక్కడ : ఐఎన్‌ఎస్ హన్స నౌకా స్థావరం, గోవా
ఎందుకు : భారత సముద్ర నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
Published date : 19 Nov 2020 06:46PM