Skip to main content

నౌక నుంచి ఉపగ్రహ ప్రయోగం

అంతరిక్ష పరిశోధన రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. నౌక నుంచి ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
ఎల్లో సముద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగంలో లాంగ్ మార్చ్-11 రాకెట్ ద్వారా మొత్తం ఏడు శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో సముద్ర ఉపరితల గాలులు, తుపాన్ల అధ్యయనానికి సంబంధించిన శాటిలైట్ ఒకటి కాగా.. మరో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. చైనా ఇటువంటి ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నౌక నుంచి ఉపగ్రహ ప్రయోగం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : చైనా
ఎక్కడ : ఎల్లో సముద్రం
Published date : 06 Jun 2019 05:47PM

Photo Stories