నావల్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి టెస్ట్ ఫైర్ విజయవంతం
Sakshi Education
బంగాళాఖాతంలో భారత నేవీ డిసెంబర్ 1న జరిపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (నావల్ వెర్షన్) టెస్ట్ ఫైర్ విజయవంతమైంది.
ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి దూరంలో ఉన్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఢీకొందని నేవీ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఉపరితలం నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి టెస్ట్ ఫైర్‌ను కూడా అధికారులు విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. బ్రహ్మోస్ క్షిపణులను ఉపరితలం, సబ్‌మెరైన్స్, యుద్ధవిమానాలు, భూతలాల నుంచి కూడా ప్రయోగించవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నావల్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి టెస్ట్ ఫైర్ విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : భారత నేవీ
ఎక్కడ : బంగాళాఖాతం
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా
Published date : 02 Dec 2020 06:05PM