నాటో ప్రధాన కార్యాలయం ఏ దేశ రాజధాని నగరంలో ఉంది?
Sakshi Education
డ్రాగన్ దేశం చైనా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) దేశాల అధినేతలు విమర్శించారు.
వ్యాపార, వాణిజ్యం, సైనిక శక్తి, మానవ హక్కుల విషయంలో చైనా వైఖరిని ఖండించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో తాజాగా నాటో సమావేశంలో 30 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ప్రపంచ భద్రతకు చైనా ఒక సవాలుగా పరిణమించిందని ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్‌ను అడ్డుకునేందుకు ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటోను 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశాయి. నాటో తన సభ్యదేశాలకు సైనిక రక్షణ అందిస్తుంది. ప్రస్తుతం 30 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఉంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉంది.
సభ్యదేశాలు
అల్బేనియా
బెల్జియం
బల్గేరియా
కెనడా
క్రోయేషియా
చెక్ రిపబ్లిక్
డెన్మార్క్
ఎస్టోనియా
ఫ్రాన్స్
జర్మనీ
గ్రీస్
హంగేరీ
ఐస్‌లాండ్
ఇటలీ
లాత్వియా
లిథువేనియా
లక్సెంబర్గ్
మాంటెనీగ్రొ
నార్త్ మాసిడోనియా
నెదర్లాండ్స్
నార్వే
పోలెండ్
పోర్చుగల్
రొమేనియా
స్లొవేకియా
స్లొవేనియా
స్పెయిన్
టర్కీ
యూకే
అమెరికా

Published date : 16 Jun 2021 07:39PM