నాటకరంగ పరిశోధకుడు నాగభూషణశర్మ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నాటకరంగ పరిశోధకుడు, ఆచార్యుడు ‘కళారత్న’ మొదలి నాగభూషణశర్మ (84) అనారోగ్యం కారణంగా గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 15న కన్నుమూశారు.
తన జీవితాన్ని నాటకకళ, నాటక రచన, పరిశోధన, బోధనకు అంకితం చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. అమెరికాలో మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్‌ట్స (థియేటర్) చేశారు. నాటకరంగ సేవలకుగానూ 2019, జనవరి 6న తెనాలిలో అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాటకరంగ పరిశోధకుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : మొదలి నాగభూషణశర్మ (84)
ఎక్కడ : తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాటకరంగ పరిశోధకుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : మొదలి నాగభూషణశర్మ (84)
ఎక్కడ : తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
Published date : 17 Jan 2019 05:35PM