Skip to main content

నాసా ది మార్స్ 2020 మిషన్ ఆవిష్కరణ

అరుణగ్రహంపైకి జీవం ఉనికిని తెలుసుకునేందుకు 2020 ఏడాది పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్)ను నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Current Affairsఅమెరికాలోని లాస్‌ఏంజెల్స్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఈ నౌకను రూపొందించారు. దీన్ని గత వారమే విజయవంతంగా పరీక్షించారు. తాజాగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రోవర్ 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహం(మార్స్)పై దిగనుంది.

ఈ రోవర్‌లో 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలు విశ్లేషించేందుకు లేజర్లను వాడారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలు అమర్చారు. కారు పరిమాణంలో ఈ రోవర్ రాళ్ల మాదిరిగా ఉండే ఉపరితలంపై కూడా సులువుగా ప్రయాణిస్తుంది. ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని ఇది పరిశోధించనుంది. అరుణగ్రహంపై రోవర్ దిగేందుకు ఎంపిక చేసిన స్థలంపై ఒకప్పుడు సరస్సు ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ది మార్స్ 2020 మిషన్ అంతరిక్ష నౌక (రోవర్) ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)
ఎక్కడ : జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, పాసడీనా, లాస్‌ఏంజెల్స్, అమెరికా
ఎందుకు : అరుణగ్రహంపైకి జీవం ఉనికిని తెలుసుకునేందుకు
Published date : 30 Dec 2019 06:16PM

Photo Stories