Skip to main content

నాలుగు చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం

నాలుగు చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ అక్టోబర్ 13న ఆమోదం తెలిపింది.
Current Affairsసభ ఆమోదం పొందిన వాటిలో భారతీయ స్టాంప్ (తెలంగాణ సవరణ) బిల్లు- 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు- 2020లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు- 2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (తెలంగాణ) సవరణ బిల్లు- 2020లను కూడా సభ ఆమోదించింది. నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
Published date : 14 Oct 2020 05:48PM

Photo Stories