Skip to main content

నాదల్‌కు మాంట్రియల్ మాస్టర్ టైటిల్

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌కు మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్ లభించింది.
కెనడాలోని టొరంటోలో ఆగస్టు 12న జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో నాదల్ 6-3, 6-0తో మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో నాదల్ కెరీర్‌లో 35వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సాధించినట్లయింది. విజేత నాదల్‌కు 10,49,040 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 48 లక్షలు) లభించింది.

మరోవైపు మహిళల విభాగం తుది పోరులో బియాంక ఆండ్రీస్క్యూ(కెనడా) 3-1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి సెరెనా విలియ మ్స్(అమెరికా) పోటీ నుంచి తప్పుకొంది. దీంతో టైటిల్ బియాంక సొంతమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : రఫెల్ నాదల్
ఎక్కడ : టొరంటో, కెనడా
Published date : 13 Aug 2019 05:22PM

Photo Stories