Skip to main content

నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల

2020-2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న విడుదల చేశారు.

Current Affairs


ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

వ్యవసాయ రుణాలు 1,34,402 కోట్లు
2020-21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి.

కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం తొలగించాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని విదేశీ వర్తక డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020-2021 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
Published date : 07 Feb 2020 05:51PM

Photo Stories