Skip to main content

నా దేశం విరబూసిన కమలం లాంటిది : మంత్రి నిర్మలా

2020-21 బ‌డ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ ఒక క‌విత‌ను చ‌దివి వినిపించారు.
Current Affairs

మంత్రి చ‌దివిన క‌విత ఇదే..
నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది
మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం
నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం
మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోటలాంటిది


నిర్మలా
బ‌డ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
వ్యవసాయ రంగానికి పెద్దపీట
  • రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
  • వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
  • పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
  • పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
  • ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
  • గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
  • నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తాం
  • ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు
జాతీయ వ్యవసాయ విధానం
  • జీరో బడ్జెట్ జాతీయ వ్యవసాయ విధానం.
  • రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం.
  • వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహానికి 'కృషి ఉడాన్'.
  • భారతీయ రైల్వే కిసాన్ రైలు తీసుకొస్తుంది.
  • ప్రస్తుతం ఉన్న గిడ్డంగులకు జియో ట్యాగింగ్.
  • ఈ సారి బడ్జెట్‌ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది
  • ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన
  • జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌కు చేయూత
  • ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం

మూడు ప్రాధాన్యతా అంశాలు ఇవే

తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం

సాగర్‌ మిత్రతో
యువ రైతులకు ప్రోత్సాహం
కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు, ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి నిర్మలా త‌న ప్రసంగంలో పేర్కొన్నారు.. మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు.. సాగర్‌ మిత్ర పథకంలో గ్రామీణ యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం అందిస్తామ‌న్నారు. పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాల చేయూత నిస్తామ‌న్నారు. మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులు. వ్యవసాయం, సాగునీటికి 2.83లక్షల కోట్లు.
Published date : 01 Feb 2020 12:06PM

Photo Stories