Skip to main content

ముంబై మారథాన్ అంబాసిడర్‌గా షానన్ మిల్లర్

టాటా ముంబై మారథాన్ 17వ ఎడిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడుసార్లు ఒలింపిక్ పతక విజేత, తొమ్మిది సార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్ట్ షానన్ మిల్లర్(42) ఎంపికయ్యారు.
Current Affairsఈ విషయాన్ని మారథాన్ నిర్వాహకులు డిసెంబర్ 27న వెల్లడించారు. ఈ మారథాన్ 2020, జనవరి 19న ముంబై నగరంలో జరగనుంది.

హాల్ ఆఫ్ ఫేమ్‌లో...
యూఎస్ ఒలింపిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రెండు సార్లు(2006లో వ్యక్తిగత, 2008లో టీమ్ విభాగం) చోటు దక్కించుకున్న ఏకైక మహిళా క్రీడాకారిణిగా మిల్లర్ గుర్తింపు పొందింది. 1992 ఒలింపిక్స్‌లో ఐదు(2 రజతం+ 3 కాంస్యం) పతకాలు సాధించిన మిల్లర్.. ఈ టోర్నీలో ఒకేసారి ఇన్ని పతకాలు నెగ్గిన అమెరికన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. మొత్తం మీద ఆమె 59 అంతర్జాతీయ, 49 జాతీయ స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టాటా ముంబై మారథాన్ 17వ ఎడిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : అమెరికా జిమ్నాస్ట్ షానన్ మిల్లర్
Published date : 28 Dec 2019 06:08PM

Photo Stories