ముంబై మాజీ సీపీ మారియా పుస్తకం విడుదల
Sakshi Education
2008 ముంబై ఉగ్రదాడుల కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా రచించిన పుస్తకం ‘లెట్ మి సే ఇట్ నౌ’ ఫిబ్రవరి 17న మార్కెట్లోకి విడుదలైంది.
2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించిన విషయాలను మారియా తన పుస్తకంలో వివరించారు. 2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు.
లెట్ మి సే ఇట్ నౌలోని కొన్ని అంశాలు...
లెట్ మి సే ఇట్ నౌలోని కొన్ని అంశాలు...
- ఐఎస్‌ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది.
- టైస్ట్‌ల్లో ప్రాణాలతో పట్టుబడిన కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించాలని కుట్ర పన్నారు. అందుకే కసబ్ పేరుని సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించారు. కానీ వారి ప్లాన్ ఫ్లాప్ అయింది.
- పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకున్నాయి.
- నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదు.
- నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు.
Published date : 19 Feb 2020 06:07PM