ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి ఐదేళ్ల జైలు శిక్ష
Sakshi Education
ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు(ఏటీసీ) జనవరి 8న ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేసుకు సంబంధించి లాహోర్‌లోని ఏటీసీ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ ఈ తీర్పునిచ్చారు. మూడు నేరాలకు సంబంధించి, ఐదేళ్ల చొప్పున, మూడు శిక్షలు ఒకేసారి అమలయ్యేలా ఈ తీర్పును ప్రకటించారు. అలాగే, మూడు నేరాలకు సంబంధించి వేర్వేరుగా పాకిస్తాన్ కరెన్సీలో 10 వేల జరిమానా విధించారు. 2008, నవంబర్ 26న ముంబై ఉగ్ర దాడులు జరిగాయి.
Published date : 09 Jan 2021 06:01PM