Skip to main content

ములుగులో అటవీ కళాశాల ప్రారంభం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల-పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 11న ప్రారంభించారు.
Current Affairs అనంతరం గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, మహతి ఆడిటోరియాలను సీఎం ప్రారంభించి.. వంద పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ప్రజల ఆరోగ్య రికార్డును తయారు చేయాలి. ముందుగా గజ్వేల్ నియోజకవర్గం ఎక్స్‌రే పేరుతో ప్రతి ఒక్కరినీ పరీక్షించి రికార్డు సిద్ధం చేయాలి. తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలి’’ అని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లెడ్ గ్రూప్, ఇతర వివరాలు తెలిస్తే వెంటనే చికిత్స అందుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరి ఆరోగ్య రికార్డు ఉంటుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :అటవీ కళాశాల-పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ములుగు, గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా
Published date : 12 Dec 2019 06:26PM

Photo Stories