Skip to main content

ముఖ్యమంత్రుల‌తో పీఎం వీడియో కాన్ఫరెన్స్‌

రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3న ముగుస్తుండ‌టంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 27 వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Current Affairs

ఈ సంద‌ర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. ‘ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను ప్రకటించాం. రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్‌), కేసీఆర్‌(తెలంగాణ), కేజ్రీవాల్‌(ఢిల్లీ), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్‌ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్‌(యూపీ) తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీ

మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ప్లాస్మా థెరపీకి కేంద్రప్రభుత్వం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : ప్రధాని న‌రేంద్ర మోదీ
ఎందుకు : కరోనా కట్టడికి తీసుకుంటున్న చ‌ర్యలు, లాక్‌డౌన్‌ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై చ‌ర్చించేందుకు
Published date : 28 Apr 2020 06:48PM

Photo Stories