ముగిసిన భారత రెజ్లర్ నర్సింగ్ నిషేధం గడువు
Sakshi Education
నాలుగేళ్ల క్రితం రియోఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... చివరి నిమిషంలో అనుమానాస్పదరీతిలోడోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై విధించిన నాలుగేళ్ల నిషేధం ఆగస్టు 8న గడువు ముగిసింది.
ఈ మేరకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి 30 ఏళ్ల నర్సింగ్‌కు అధికారికంగా సమాచారం వచ్చింది. 2020 ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్(74 కేజీల విభాగం) కు మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనే ద్వారాలు తెరుచుకున్నాయి. 2015 ప్రపంచ చాంపియన్ షిప్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించడంతో 2016 రియోఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే రియోఒలింపిక్స్‌కు రెండు వారాలు ఉన్నాయనగా నర్సింగ్ డోపింగ్‌లోపట్టుబడటం, అతనిపై నిషేధం విధించడం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ముగిసిన భారత రెజ్లర్ నర్సింగ్ నిషేధం గడువు
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : నర్సింగ్ యాదవ్క్విక్ రివ్యూ :
ఏమిటి : ముగిసిన భారత రెజ్లర్ నర్సింగ్ నిషేధం గడువు
ఎప్పుడు : ఆగస్టు 8
Published date : 11 Aug 2020 05:47PM