Skip to main content

మూడో దశకు కరోనా ఔషధ పరీక్షలు

కరోనా వైరస్‌ నియంత్రణ ఔషధ తయారీలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ కీలకదశకు చేరుకుంది.
Current Affairs
కరోనా యాంటివైరల్‌ ట్యాబ్లెట్‌ ఫావిపిరావిర్‌కు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులను పొందింది. దీంతో దేశంలో ఫేజ్‌–3 అనుమతులు పొందిన తొలి కంపెనీగా గ్లెన్‌మార్క్‌ నిలిచింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశంలోని 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. జూలై– ఆగస్టు నెలలో క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ 150 మంది కరోనా రోగుల మీద 1:1 నిష్పత్తిలో పరిశోధన ఉంటుంది. చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుంది. జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిల్మ్‌ కార్పొరేషన్‌ అనుబంధ ఫార్మా కంపెనీ ఫ్యూజిఫిల్మ్‌ తొయోమా కెమికల్‌ కో లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన అవిగాన్‌ మందుకు జనరిక్‌ వర్షనే ఈ ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్‌.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మూడో దశకు కరోనా ఔషధ పరీక్షలు
ఎప్పుడు : మే 12
ఎవరు : గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌
Published date : 13 May 2020 08:42PM

Photo Stories