Skip to main content

మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్

ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది.
ఈ మేరకు బెంగళూరులో నవంబర్ 5న జరిగిన 16వ నాస్కామ్ ప్రోడక్ట్ సదస్సులో దేశీ టెక్నాలజీ స్టార్టప్ వ్యవస్థపై ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ ఉన్నారు.

నాస్కామ్ నివేదికలోని ముఖ్యాంశాలు
  • 2019 ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900-9,300 స్థాయికి చేరినట్లయింది.
  • 2018లో టెక్ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800-8,200 దాకా ఉంది.
  • 2014-2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదు.
  • 2025 నాటికి యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్య దేశీయంగా 95-105 శ్రేణిలో ఉండొచ్చు.
  • సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత స్థానంలో ఉంది.
  • కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్‌ల్లో 12-15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటున్నాయి.
  • 2014లో 10-20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350-390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదు.
  • స్టార్టప్స్‌లోకి 2018 ఏడది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2019 ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి.
  • 2018 ఏడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య 24కి పెరిగింది.
  • 2018లో టెక్ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి.
  • 2019లో 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3-1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగింది.
  • దేశీ స్టార్టప్‌లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయి.
Published date : 06 Nov 2019 06:09PM

Photo Stories