మూడీస్ అంచనాల ప్రకారం 2021-22లో భారత జీడీపీ వృద్ధి రేటు?
Sakshi Education
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది.
చదవండి: దవ్యలోటు ఎంత శాతం దాటకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం?
అందరి అంచనాలూ క్షీణతే..
మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి.
ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)...
ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు మూడీస్ తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను సెప్టెంబర్ 11న విడుదల చేసింది.
మూడీస్ నివేదికలోని అంశాలు...
- వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది.
- తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020-21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం.
- ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది.
చదవండి: దవ్యలోటు ఎంత శాతం దాటకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం?
అందరి అంచనాలూ క్షీణతే..
మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి.
ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)...
సంస్థ | తాజా అంచనా | క్రితం అంచనా |
గోల్డ్‌మన్ శాక్స్ | 14.8 | 11.8 |
ఫిచ్ | 10.5 | 5.0 |
ఇండియా రేటింగ్‌స - రిసెర్చ్ 11.8 | 5.3 |
|
ఎస్‌బీఐ ఎకోర్యాప్ | 10.9 | 6.8 |
కేర్ రేటింగ్‌స | 8.2 | 6.4 |
Published date : 12 Sep 2020 05:25PM