Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 1, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 1st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Marchi 1st 2023 Current Affairs

Friendship Award: సీగల్‌కు రష్యా ఫ్రెండ్‌షిప్‌ అవార్డు 
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించిన హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ స్టీవె న్‌ సీగల్‌ (70)కు రష్యా ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ అవార్డు ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సీగల్‌ గట్టి మద్దతుదారు. 2014లో క్రిమియా ఆక్రమణను కూడా సమర్థించారు. 2016లో ఆయనకు రష్యా తమ దేశ పౌరసత్వం కూడా ఇచ్చింది. అంతేగాక పుతిన్‌ వ్యక్తిగతంగా సీగల్‌కు రష్యా పాస్‌పోర్టు అందజేశారు! 2018 నుంచీ అమెరికా, జపాన్‌ దేశాల్లో రష్యా విదేశాంగ శాఖ ప్రత్యేక రాయబారిగా కూడా సీగల్‌ పని చేస్తున్నారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు కూడా ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ అవార్డు ప్రకటించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Hollywood Films: ఈ హాలీవుడ్‌ సినిమాలు చూస్తే ఇక జైలుకే!
హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్‌ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్‌ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్‌ పత్రిక పేర్కొంది.
దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్‌ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్‌ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది.  డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

Narendra Modi: 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‌’ 
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్‌ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్‌లీషింగ్‌ ద పొటెన్షియల్‌: ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ యూజింగ్‌ టెక్నాలజీ’ పేరిట ఫిబ్ర‌వ‌రి 28న నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
టెక్నాలజీతో పేదలకు లబ్ధి  
అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్‌తోపాటు జన్‌ ధన్‌ యోజన, ఆధార్, మొబైల్‌ నెంబర్‌(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు.  

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'

Tiger Mortality: పులులకు ‘ఎండదెబ్బ’.. పదేళ్లలో 1,062 పులుల మృత్యువాత 

దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 30కి పైగా పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 
2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. 
అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి!

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు 
ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది.
వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు.. 
☛ ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం 
☛ అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం
☛ ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు 
☛ అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్‌ జోన్‌లు లేకపోవడం 
☛ అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం 

Cheetahs: యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు

Manish Sisodia: మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర రాజీనామా
 
ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ రాష్ట్ర కేబినెట్‌లోని మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆమోదించారు. సిసోడియా పోర్ట్‌ఫోలియోలను రెవెన్యూ మంత్రి కైలాశ్‌ గహ్లోత్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌లకు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్య, పరిశ్రమల శాఖలకు మంత్రిగా ఉన్న సత్యేందర్‌ జైన్‌ మనీలాండరింగ్‌ కేసులో గత ఏడాది మే నుంచి తిహార్‌ జైలులో ఉన్నారు.
శాఖలేవీ లేకుండానే ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. జైన్‌ కున్న శాఖలను కూడా సీఎం కేజ్రీవాల్‌ డిప్యూటీ సీఎం కూడా అయిన సిసోడియాకే కేటాయించారు. దీంతో, ఢిల్లీ ప్రభుత్వంలోని 33 శాఖలకు గాను ఆర్థిక, తదితర 18 శాఖలను నిర్వహిస్తున్న సిసోడియా కేబినెట్‌లో అత్యంత కీలకంగా ఉన్నారు. మద్యం పాలసీ కేసులో ఫిబ్ర‌వ‌రి 26న సీబీఐ సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Badminton Nationals: పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి టైటిల్‌ 
జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్‌ విభాగంలో విజేతగా అవతరించింది. ఫిబ్ర‌వ‌రి 28న‌ పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్‌ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది. 

FIFA Football awards: 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా అర్జెంటీనా కెప్టెన్‌గా మెస్సీ 
తన అద్భుత ప్రతిభతో 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అర్జెంటీనా జట్టును మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టిన లియోనెల్‌ మెస్సీ 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు. గత ఏడాది ఖతర్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌ ఫైనల్లో కెప్టెన్‌ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్‌ చేశాడు. ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌ అవార్డు కోసం మెస్సీ, కిలియాన్‌ ఎంబాపె (ఫ్రాన్స్‌), కరీమ్‌ బెంజెమా (ఫ్రాన్స్‌) పోటీపడ్డారు. జాతీయ జట్ల కెప్టెన్‌లు, కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్ట్‌లు, ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్యలో సభ్యత్వం ఉన్న 211 దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
ఓటింగ్‌లో మెస్సీకి 52 పాయింట్లు రాగా.. ఎంబాపెకు 44 పాయింట్లు, కరీమ్‌ బెంజెమాకు 34 పాయింట్లు వచ్చాయి. గత 14 ఏళ్లలో మెస్సీ ఏడోసారి ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌ అవార్డు గెల్చుకోవడం విశేషం. ఉత్తమ కోచ్‌గా అర్జెంటీనాకు ప్రపంచ టైటిల్‌ దక్కడంలో కీలకపాత్ర పోషించిన లియోనెల్‌ స్కలోని ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్‌కు చెందిన అలెక్సియా పుటెలాస్‌కు లభించింది.  

Snooker World Cup: మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ విజేత భారత్‌
మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత జట్టుకు టైటిల్‌ లభించింది. అమీ కమాని–అనుపమ రామచంద్రన్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో అమీ కమాని–అనుపమ జోడీ 56–26, 67–27, 41–61, 27–52, 68–11, 55–64, 78–39తో ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుకు చెందిన రీని ఇవాన్స్‌–రెబెకా కెన్నా ద్వయంపై విజయం సాధించింది.



Union Government: ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు మార్పు 
కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. ఔరంగాబాద్‌ను ‘ఛత్రపతి శంభాజీ నగర్‌’గా, ఉస్మానాబాద్‌ను ‘ధారాశివ్‌’గా మార్పు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్‌ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది.

Shiv Sena: రూ.2,000 కోట్లతో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కొనుగోలు!

Published date : 01 Mar 2023 06:26PM

Photo Stories