Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 8, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 8th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 8th Current Affairs

International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం
కంచెలు తెంచేశాం. హద్దులు చెరిపేశాం. ఆంక్షలు తుడిచేశాం.  అవరోధాలు ఎదిరించాం. నేల, నింగి, నీరు, ఊరు.. కొలువు, క్రీడ, కార్మిక వాడ.. గనులు, ఓడలు, రోదసి యాత్రలు.. పాలనలో.. పరిపాలనలో.. ఆర్థిక శక్తిలో.. అజమాయిషీలో సైన్యంలోన సేద్యంలోన అన్నీ మేమై.. అన్నింటా మేమై.. అవకాశం కల్పించుకుంటాం. అస్తిత్వం నిలబెట్టుకుంటాం. స్త్రీని గౌరవించే సమాజం.. స్త్రీని గౌరవించే సంస్కారం.. ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రతి రంగంలో పాదుకొనాలి. 

ఆకాశంలో సగం అవనిలో సగమైన‌ మ‌హిళ‌ల కోసం ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ సంద‌ర్భంగా 1909 ఫిబ్రవరి 28న USAలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరిసా మల్కెయిల్ ఈ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ దినోత్సవాన్ని ప్రారంభించారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 

U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..  

అనంత‌రం 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరాస నిర్వహించింది. సంస్థ సంబరాలు ప్రారంభించింది. తదనంతరం, ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా UN కొత్త థీమ్‌ను ప్రవేశపెడుతుంది.2023 సంవత్సరం థీమ్ 'బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ఈ క్వాలిటీ.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Megha Trophiques-1: శాటిలైట్‌ను సముద్రంలో కూల్చేసిన ఇస్రో
మేఘా ట్రోపిక్స్‌–1 (ఎంటీ–1) అనే కాలం చెల్లిన ఉపగ్రహాన్ని తిరిగి భూమిపైకి తెచ్చేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగం సఫలీకృతమైంది. భూ కక్ష్యలోకి ప్రవేశించిన ఎంటీ–1ను నిర్దేశిత పసిఫిక్‌ సముద్రంలోని నిర్జన ప్రదేశంలో కూల్చేసింది. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం 2011లో పీఎస్‌ఎల్‌వీ–సి18 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈ వెయ్యి కిలోల బరువైన ఉపగ్రహం 2021 నుంచి పనిచేయడం మానేసింది. అందులో మిగిలిపోయిన సుమారు 125 కిలోల ఇంధనంతో పేలుడు సంభవించి, ఇతర శాటిలైట్లకు ముప్పు వాటిల్లుతుందని ఇస్రో అంచనా వేసింది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ ఉపగ్రహాన్ని తిరిగి కక్ష్య వెలుపలికి తీసుకురావాలనే క్లిష్టమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 
నియంత్రిత పునరాగమనం పద్ధతిలో చేపట్టిన ఈ సరికొత్త ప్రయోగం కోసం  ఎంటీ–1లోని ఇంధనాన్నే ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శాటిలైట్‌ను క్షక్ష్య వెలుపలి నుంచి తక్కువ ఎత్తులోకి తీసుకువచ్చి, లక్షిత ప్రాంతంలో నష్టం కనిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాము చేపట్టిన కార్యక్రమం మార్చి 7వ తేదీ పూర్తిస్థాయిలో విజయవంతమైందని బెంగళూరులోని ఇస్రో కేంద్ర కార్యాలయం ట్వీట్‌ చేసింది. సాధారణంగా, భారీ ఉపగ్రహాలు లేదా రాకెట్లు భూ కక్ష్యలోకి వచ్చాక మండిపోతాయి. దీనివల్ల చిన్న శకలాలు భూమిపై పడితే పెద్దగా నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రవేశపెట్టే శాటిలైట్లను నియంత్రిత పునరాగమనానికి వీలుగానే తయారు చేస్తున్నారని, ఎంటీ–1లో మాత్రం అలాంటి వెసులుబాటు లేదని ఇస్రో తెలిపింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Neiphiu Rio: నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి రియో  
నేషనల్‌ డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నెఫియు రియో(72) నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా, మరికొందరు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో ఎన్‌డీపీపీకి చెందిన ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యే క్రూసె కూడా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో క్రూసె ఒకరు. మార్చి 7వ తేదీ గవర్నర్‌ లా గణేశన్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 
రాష్ట్ర అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమి 37 చోట్ల విజయం సాధించింది. రియో ప్రభుత్వానికి ఇతర పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు అందజేశారు. దీంతో, ప్రతిపక్షం లేని అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వానికి సీఎం రియో నాయకత్వం వహించనున్నారు.
రియో మొదటిసారిగా 2003లో నాగాలాండ్‌ సీఎం అయ్యారు. మళ్లీ 2008, 2013ల్లో కూడా సీఎం పదవి చేపట్టారు. 2014లో రాజీనామా చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2018లో సీఎం అయ్యారు. నాలుగు పర్యాయాలు సీఎంగా ఉన్న ఎస్‌సీ జమీర్‌ õరికార్డును తాజాగా బద్దలు కొట్టారు.

Ladli Behna Yojana: మహిళల కోసం ‘లాడ్లి బెహనా’ యోజన

Conrad Sangma: మేఘాలయ సీఎంగా కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణం 
మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్‌ కాన్రాడ్‌ కె.సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ఆయన పార్టీకే చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ , హెచ్‌ఎస్‌పీడీపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మార్చి 7వ తేదీ షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ వీరందరి చేత పదవీ ప్రమాణం చేయించారు. ఇందులో ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.  
నిబంధనల ప్రకారం.. నాగాలాండ్‌ అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను సీఎంతో కలిపి మంత్రివర్గంలో 12 మందికి మించి ఉండరాదు. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కాన్రాడ్, మంత్రులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయ మరింతగా అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్య సాధనలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యాటకంతోపాటు మౌలిక సదుపాయాలను, రహదారులు, విద్యుత్, నీటి వసతులను మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యాలని ప్రమాణ స్వీకారం అనంతరం సంగ్మా పీటీఐకి చెప్పారు.

Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!

Indian Navy: నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం 
దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మార్చి 7వ తేదీ ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్‌ బాంబులు, క్రూయిజ్‌ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్‌ఎస్‌ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ), ఇజ్రాయిల్‌ ఎరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తోంది. 
భారత రక్షణ దళం శక్తివంతం 
‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్‌ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్‌ ఏరియల్‌ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్‌ఎస్‌ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్‌ పల్స్‌ రాకెట్‌ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్‌ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది.

Moon: భూమికి క్రమంగా దూరమ‌వుతున్న చంద్రుడు.. ఏటా ఎంత దూరం జరుగుతున్నాడంటే?
మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ –టు –ఎయిర్‌ మిస్సైల్‌ (ఎంఆర్‌ఎస్‌ఏఎం) ప్రత్యేకతలు
పరిధి: 70 కిలోమీటర్లు 
మార్గదర్శకత్వం: డ్యూయల్‌ (కమాండ్‌ –యాక్టివ్‌ రాడార్‌ సీకర్‌ (ఆర్‌ఎఫ్‌) 
నియంత్రణ: టీవీఎస్‌ అండ్‌ ఏరోడైనమిక్‌ 
ప్రొపల్షన్‌: డ్యూయల్‌ పల్స్‌ –సాలిడ్‌ మోటార్‌ 
వార్‌ హెడ్‌: ప్రీ–ఫ్రాగ్మెంట్‌ 
ప్రయాణ సమయం: 230 సెకన్లు 
పొడవు: 4500 మిల్లీమీటర్లు 
వ్యాసం: 225 మిమీ 
బరువు: 275 కిలోలు 
లాంచర్‌: షిప్‌/వాహనం (నిలువు) లాంచ్‌.  

Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..

H3N2 Influenza: కోవిడ్‌ తరహాలో విస్తరిస్తున్న హెచ్‌3ఎన్‌2.. విపరీతంగా పెరుగుతున్న కేసులు 

దేశాన్ని మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 అనే కొత్త రకం వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. అచ్చంగా కోవిడ్ లక్షణాలు కలిగిన ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత కొంత కాలంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తర భారతంలో ప్రతీ ఇద్దరిలో ఒకరు దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వైరస్‌ కోవిడ్‌ తరహాలో తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీలోని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. పండగల సీజన్‌ కావడంతో ప్రజలందరూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పది మందిలోకి వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా చేయాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతీ ఏడాది వేసవి కాలం సమీపిస్తున్నప్పుడు వైరస్‌లు ఉత్పరివర్తనం చెందుతూ అత్యధికులకు సోకుతూ ఉంటాయని, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా వీటి బారిన పడుతున్నారని గులేరియా తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

 


H3N2 Influenza: కాన్సూర్‌లో భారీగా H3N2 వైరస్ కేసులు 
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చాలా మంది H3N2 వైరస్ బారిన ప‌డుతున్నారు. దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కట్ట‌డంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. కాన్పూర్‌ నగరంలోని హల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రికి  జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో రోగుల‌ను ఎమర్జెన్సీ వార్డుల నుంచి ఇతర వార్డులకు తరలిస్తున్నారు. 

ఈ పరిస్థితిపై వైద్యాధికారులు మాట్లాడుతూ సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం. కానీ, ఈ సారి రోగుల‌ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది ఆసుప‌త్రిలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నార‌ని తెలిపారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

Antarctic Sea: అంటార్కిటికా కరిగిపోతోంది.. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు..! 

పర్యావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! 
ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వానించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు!
అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటి నుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది.

Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలు
అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ విల్‌ హాబ్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మికి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు.   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Defence Ministry: 70 శిక్షణ విమానాల కొనుగోలుకు.. రూ.6,800 కోట్ల ఒప్పందం 
భారత వైమానిక దళానికి 70 హెచ్‌టీటీ–40 రకం ప్రాథమిక శిక్షణ విమానాల కొనుగోలుకు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో రక్షణ శాఖ రూ.6,800 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఆరేళ్లలోగా అందజేయాల్సి ఉంటుంది. మూడు కేడెట్‌ ట్రెయినింగ్‌ షిప్‌ల కోసం ఎల్‌అండ్‌టీతో మరో రూ.3,100 కోట్ల ఒప్పందం ఖరారు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ షిప్‌లను 2026 నుంచి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. మార్చి 7వ తేదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Shotgun World Cup: స్కీట్‌లో గనీమత్‌ జాతీయ రికార్డు సమం 
ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ గనీమత్‌ సెఖోన్‌ జాతీయ రికార్డును సమం చేసింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల గనీమత్‌ క్వాలిఫయింగ్‌లో 125 పాయింట్లకుగాను 120 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. షూట్‌ ఆఫ్‌లో గనీమత్‌ గురి తప్పి టాప్‌–8లో నిలువలేకపోయింది. భారత్‌కే చెందిన దర్శన రాథోడ్‌ 117 పాయింట్లతో 25వ స్థానంలో, మహేశ్వరి చౌహాన్‌ 116 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Arogya Mahila Scheme: తెలంగాణ‌లో ‘ఆరోగ్య మహిళ’ ప‌థ‌కం ప్రారంభం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ప్రారంభించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ప్రతి మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించనున్నారు. 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, కేన్సర్‌ స్క్రీనింగ్, పోషకాహార లోపంతో వచ్చే సమస్యలు, మూత్రసంబంధిత సమస్యలు, మెనోపాజ్‌ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెన్‌స్ట్రువల్‌ సమస్యలు, సుఖవ్యాధులు, తక్కువ బరువున్న సమస్యలకు వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 20 పాథలాజికల్‌ లాబ్‌లలో నిర్వహిస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే సంబంధిత మహిళలకు అందచేస్తారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో 30 ఏళ్లు పైబడ్డ మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మమోగ్రామ్చ కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్‌స్మియర్‌ పరీక్షలను నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రుల్లో నిర్ధారిత కేన్సర్‌ మహిళలకు చికిత్స అందిస్తారు. అయోడిన్‌ లోపం (థైరాయిడ్‌ ), విటమిన్‌ డి–3, బి–12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు. మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే మహిళలకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మెనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతానలేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ చేస్తారు. అవసరమున్నవారికి అ్రల్టాసౌండ్‌ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్‌ చేస్తారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో పాటు పేషంట్‌ కేర్‌ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు.

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం

 

Published date : 08 Mar 2023 06:46PM

Photo Stories