Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 31, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 31st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 31st 2023 Current Affairs

H-1B Visa: ఉద్యోగ కోతల వేళ భారతీయ టెకీలకు శుభవార్త..హెచ్‍-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయెచ్చు..

ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్‌ కంపెనీలు హెచ్‌–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని ఓ అమెరికా న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. 
అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్‌ ఇమిగ్రెంట్‌ హెచ్‌–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్నారు.
అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్‌–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. 
హెచ్‌–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్‌ కార్డ్‌ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. 

US Visa: భారత టెకీలకు భారీ ఊరట.. పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు
ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 
ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. 
ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్‌ విచారించారు. 
‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్‌ చేస్తామని సంస్థ తెలిపింది. 

Global Crisis: ఎందుకు ఇన్ని కొలువులు పోతున్నాయ్‌... తాజాగా మ‌రో 7 వేల‌మంది జౌట్‌.. ఎక్క‌డంటే
 
Covid Cases: భారీగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. దేశంలో ఒకే రోజు 3,095 మందికి క‌రోనా..  

దేశంలో కరోనా వైరస్ కేసులు మ‌ళ్లే పెరుగుతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 31న తెలిపింది. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్ర‌స్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. 

గత 24 గంట‌ల్లో తాజా కేసులతో రికవరి రేటు 98.78% తగ్గింది. మరణాల రేటు 1.19%గా ఉంది. గత మార్చి 30నే దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 50% పెరుగుదల కనిపించింది. కాగా, మహారాష్ట్రలో కొత్తగా 694 కొత్త కేసులు, కేరళలో 765 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారుల‌తో మార్చి 31న సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మార్చి 29న ఢిల్లీలో 300 కేసులు న‌మోదు కాగా ఇద్ద‌రు చ‌నిపోయార‌ని తెలిపారు. 

Coronavirus: పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌.. అప్రమత్తత ముఖ్యమ‌న్న మోదీ

ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి 
కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు మార్చి 29న  ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్‌ కాంప్‌బెల్‌కు 30 మైళ్లదూరంలో ఘటన చోటుచేసుకుంది. 101 ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌కు చెందిన హెచ్‌హెచ్‌–60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్‌ ఆండీ చెప్పారు.


అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన ఎమ్మెల్యే!
త్రిపుర శాసనసభలో అధికార బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌ తన మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలు తిలకిస్తూ దొరికిపోయాడు. త్రిపుర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మార్చి 29న‌ ఆయన సభలో ఫోర్న్‌ వీడియోలు చూస్తున్నట్లుగా వీడియో క్లిప్‌ ఒకటి బయటకు వచ్చింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాదవ్‌ లాల్‌నాథ్‌ గత ఎన్నికల్లో ఉత్తర త్రిపుర జిల్లాలోని బాగ్‌బస్సా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సభలో ఉండగా తన ఫోన్‌కు కాల్ వచ్చిందని, వెంటనే ఫోన్‌ తెరపై అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయని అన్నారు. వెంటనే వాటిని క్లోజ్‌ చేశానని తెలిపారు. అసెంబ్లీలో ఫోన్‌ వాడొద్దన్న సంగతి తనకు తెలుసని చెప్పారు. అసెంబ్లీ ప్రతిష్టను మంటగలిపిన జాదవ్‌ లాల్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కాగా 2012లో కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికిపోయారు.    

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Temple Floor Collapse: ఆలయంలో విషాదం.. 14 మంది భక్తులు మృతి 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో బావి పైకప్పు కూలి 14 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పటేల్‌నగర్‌లోని బేలేశ్వర్‌ మహాదేవ్‌ ఝులేలాల్‌ ఆలయంలో పూజా కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు బావిపై కట్టిన స్లాబ్‌పై నిలబడి ఉండగా అది హఠాత్తుగా కూలింది. సుమారు 35 మంది బావిలో పడిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సాయంత్రం వరకు 19 మందిని కాపాడగలిగారు. మరో 14 మంది చనిపోయినట్లు కలెక్టర్‌ ఇళయరాజా చెప్పారు. వీరిలో 10 మంది మహిళలేనన్నారు. విశాలమైన పురాతన బావిపై స్లాబ్‌ వేసి, దానిపై ఆలయం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని సీఎం  చౌహాన్ ప్రకటించారు. 

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

నిఘా ఆరోపణలతో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విలేకరి అరెస్ట్‌ 
ఉక్రెయిన్‌ యుద్ధంతో బద్ధశత్రువులుగా తయారైన అమెరికా, రష్యాల సంబంధాలు మరింత క్షీణించే పరిణామం ఒకటి సంభవించింది. రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’కు చెందిన ఇవాన్ గెర్ష్‌కోవిచ్‌ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎఫ్‌ఎస్‌బీ) అరెస్ట్ చేసింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది. ‘అమెరికా ఆదేశాలతోనే నిషేధిత ప్రాంతంలోని తమ సైనిక పారిశ్రామికవాడలోని ఒక సంస్థకు చెందిన రహస్య పత్రాలను సేకరించడంలో ఇవాన్‌ బిజీగా ఉన్నాడు. అందుకే అరెస్ట్‌చేశాం’ అని ఎఫ్‌ఎస్‌బీ మార్చి 30న ప్రకటించింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా పనిచేసే ఇవాన్‌ ఉక్రెయిన్, రష్యా, ఇతర సోవియట్‌ యూనియన్‌ దేశాల్లో వార్తల కవరేజీ విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా మోపిన నేరం రుజువు అయితే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తమ విలేకరి అరెస్ట్‌ను వార్తా సంస్థ తీవ్రంగా ఖండించింది. కోల్డ్‌ వార్‌ తర్వాత అమెరికా రిపోర్టర్‌ను రష్యా అరెస్ట్‌చేయడం ఇదే తొలిసారి. ఇవాన్‌ను ఏ తేదీలో అరెస్ట్ చేసిందీ ఎఫ్‌ఎస్‌బీ వెల్లడించలేదు గానీ ఉరాల్‌  పర్వతాల దగ్గర్లోని ఎకటిన్‌బర్గ్‌ నగరంలో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా జైళ్లలో ఉన్న రష్యా ఆయుధ మధ్యవర్తి విక్టర్‌ బౌట్‌ను, డబ్ల్యూఎన్‌బీఏ స్టార్‌ బ్రిట్నీ గ్రీనర్‌ను రష్యా, అమెరికాలు మార్చుకున్న విషయం విదితమే. 

South Africa: టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అత్య‌ధిక‌ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా

Mystery Virus: మిస్ట‌రీగా కొత్త వైర‌స్‌.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలపై మరో కొత్త‌ వైరస్ ముంచుకొస్తోంది. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్‌ కారణంగా ఒకే రోజులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వైర‌స్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, ముక్కు నుంచి రక్తస్రావం జరగడం లాంటి లక్షణాలు ఉన్నట్లు స్థానికి వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి రోగిని త్వరగా చంపేస్తుందని తెలుస్తోంది. 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్‌ చేశారు. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో  మార్‌బర్గ్‌ అనే వైరస్‌ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్‌ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చుట్టుపక్కల దేశాలకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

World Bank: భారత్‌ వృద్ధికి సంస్కరణల ఊతం.. ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషణ
భారత్‌ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది.

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు.
☛ భారత్‌ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. లింక్ చేయ‌క‌పోతే ఏమ‌వుతుందో తెలుసా..?

IPL 2023: ఐపీఎల్‌ 16వ సీజన్ ప్రారంభం.. మే 28న ఫైనల్‌ మ్యాచ్‌   
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ 16వ సీజన్ మార్చి 31న ప్రారంభ‌మై మే 28 వరకు జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. కరోనా కారణంగా గత మూడు సీజన్ల పాటు వేదికల విషయంలో షరతుల కారణంగా అందరికీ తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు భారీ స్థాయిలో, స్థానిక అభిమానుల మద్దతుతో పది జట్లూ హంగామాకు సిద్ధమయ్యాయి. మారిన ఆటగాళ్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులతో పదహారో సీజన్‌ లీగ్‌ కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ జట్లకు ఆడుతున్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు చెందిన ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్‌ టీమ్‌లతో చేరతారు.  మార్చి 30న‌ అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్‌ల ఫొటో సెషన్‌ నిర్వహించారు. అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాజరుకాలేదు.  

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..  
కొన్ని మార్పులు.. 
‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ పేరుతో కొత్త నిబంధనను లీగ్‌ కౌన్సిల్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం తాము ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్‌ మధ్యలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగవచ్చు. అంటే బ్యాటింగ్‌ ఒకరు చేసిన తర్వాత అతని స్థానంలో తర్వాతి ఇన్నింగ్స్‌లో మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం జట్టుకు ఉంది. అంటే పరిస్థితులను బట్టి ప్లేయర్‌ను మార్చుకునే ఈ సౌకర్యం జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌ తొలి విజేతగా ముంబై ఇండియన్స్..  

Published date : 31 Mar 2023 06:53PM

Photo Stories