Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 30, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 30th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 30th 2023 Current Affairs in Telugu

Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. 

మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ రెండు గుర్తింపు కార్డులు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN), ఆధార్ కార్డు. ఈ రెండింటిని లింక్ చేయాల‌ని, లేదంటే పాన్ కార్డు పని చేయకుండా పోతుందని ఇప్ప‌టికే ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. దీనిని కేంద్రం మరో మూడు నెలలు అంటే జూన్‌ 30 వరకు పొడ‌గించింది.  

మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా..?
☛ మీ పాన్ కార్డుకు ఆదార్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవ‌డానికి ముందుగా ఆదాయపు పన్నుశాఖ‌ అధికారిక వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in లోకి వెళ్లండి. 
☛ అక్క‌డ హోం పేజీలో ఉన్న Link Aadhaar Status పై క్లిక్ చేయండి. 
☛ మీ పాన్‌, ఆధార్ నెంబ‌ర్ల‌ను ఎంట‌ర్ చేయండి. 
☛ View Link Aadhaar Status పై క్లిక్ చేయండి.
☛ మీ ఆధార్ లింక్ అయ్యింటే Your PAN BXXXXXXXXQ is already linked to given Aadhaar 2XXXXXXXXXX0 అని వ‌స్తుంది. లేదంటే Your PAN BXXXXXXXXQ is Not linked to given Aadhaar 2XXXXXXXXXX0 అని వ‌స్తుంది.

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

ఆన్‌లైన్ ద్వారా ఆధార్-పాన్ లింక్ చేయండిలా..
☛ ఆదాయపు పన్ను శాక అధికారిక వెబ్ సైట్ eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ కావాలి.
☛ ఒక‌వేళ మీరు రిజిస్టర్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి


ONGC: కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ చమురు ఉత్పత్తి 
ప్రభుత్వరంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) కృష్ణా గోదావరి బేసిన్‌ (కేజీ బేసిన్‌)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్‌ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ (ఉత్పత్తి విభాగం) పంకజ్‌ కుమార్‌ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్‌–98/2 క్లస్టర్‌–2 క్షేత్రాల నుంచి గ్యాస్‌ ఉత్పత్తిని 2019 జూన్‌లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్‌ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్‌జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్‌ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్‌కు వాయిదా వేసింది. ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్‌ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్‌జీసీ చెబుతోంది.

Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీల‌క నిర్ణ‌యం!
ఫ్లోటింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశాం..
ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్‌ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్‌ను (ఎఫ్‌పీఎస్‌వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ పంకజ్‌ కుమార్‌ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. 
‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ కూడా బయటకు వస్తుంది. వాస్తవంగా గ్యాస్‌ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’ అని వివరించారు.  

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

UPI Payments: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..  
ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. 
ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్‌ లావాదేవీలకు మాత్రమే ఇంటర్‌చేంజ్‌ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. 
వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ.2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌చేంజ్‌ చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..
అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్‌ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది. 
ఒక కంపెనీకి చెందిన వాలెట్‌ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్‌ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. 
రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్‌చేంజ్‌ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. 
ప్రస్తుతం మొబైల్‌ వాలెట్‌ పేమెంట్‌ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

G20 Summit 2023: విభిన్నంగా జీ–20 విశాఖ సదస్సు

దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సుల్లో భాగంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు అత్యంత కళాత్మకంగా నిలుస్తు­న్నా­యి.
జీ–20 దేశాల జెండాల వైభవంతో పాటు వసు­దైక కుటుంబమనే థీమ్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. భారతీయ సంప్రదాయాల డిజైన్లు, మ్యూరల్‌ ఆర్ట్స్‌­ను గుంటూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ విజు­వల్‌ ఆర్టిస్ట్‌ జాన్‌ రత్నబాబు బండికొల్ల ప్రపంచానికి పరిచయం చేశారు. రత్నబాబు కళాప్రతిభని చూసి విదేశీ ప్రతినిధులు అచ్చెరువొందుతున్నారు.
విభిన్నంగా విశాఖ సదస్సు
ఇప్పటివరకూ 20కి పైగా నగరాల్లో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. వీటన్నింటితో పోలిస్తే విశాఖ సదస్సు విభిన్నమైనదిగా గుర్తింపు పొందింది. సభా ప్రాంగణంతో పాటు నగరమంతా మురిసిపోయేలా రూపొందించిన డిజైన్లు అతిథులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీన్ని కళాత్మక సదస్సుగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన జాన్‌ రత్నబాబు ఏయూలో బీఎఫ్‌ఏ చేశారు. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

G20 Summit 2023: విశాఖపట్నంలో జీ–20 సదస్సు..
జీ–20 విశాఖ లోగో కూడా అద్భుతం..
జీ–20 థీమ్‌ అయిన వన్‌ ఎర్త్‌.. వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఫ్యూచర్‌ (వసుదైక కుటుంబం)ని చాటిచెప్పేలా జాన్‌ లోగో డిజైన్‌ చేశారు. 
♦  ఒక గ్లోబ్‌లో అక్షర క్రమంలో జీ–20 దేశాల జాతీయ జెండాలను ఆయా దేశాల ప్రజలు పట్టుకుని ఉన్నట్లుగా చిత్రీకరణ చేశారు. మధ్యలో మన జాతీయ వృక్షం మర్రిచెట్టు, జాతీయ పక్షి పురివిప్పిన నెమలిని కూడా చిత్రీకరించారు. ఈ మర్రి వృక్షానికి జీ–20 దేశాల జాతీయ పక్షులు, పుష్పాలు జోడించారు. 
♦ అదేవిధంగా వృక్షం చివర్లో వన్‌ ఫ్యామిలీకి గుర్తుగా నెమలి పింఛాలు, మర్రి వృక్షం మొదట్లో ఒక తండ్రి, తల్లి మధ్యలో బాలుడు, వారి ఇల్లుని, వన్‌ ఫ్యూచర్‌కి సింబాలిక్‌గా సీతాకోక చిలుకల పెయింటింగ్‌ వేశారు. 
♦ సదస్సుకు ఆహ్వానం పలుకుతున్న విశాఖనగరానికి చిహ్నంగా సముద్రం, డాల్ఫిన్‌ నోస్, లైట్‌హౌస్, పక్కనే చర్చి, మధ్యలో గుడి, మసీద్‌ను వేశారు. 
 ♦  మొత్తంగా త్రివర్ణ పతాకాన్ని డిజైన్‌ చేసి.. ప్రతి ఒక్కరూ వహ్వా అనేలా రూపొందించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు 
భారత మహిళల హాకీ స్టార్‌ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎమ్‌సీఎఫ్‌ హాకీ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ అని పిలవనున్నారు. స్వ‌యంగా ఆమెనే ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్‌ పేరుపెట్టడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్ అనంత‌రం గాయపడ్డ రాణి(28) ఈ మధ్యే పూర్తి ఫిట్‌నెస్‌తో ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 30 Mar 2023 06:21PM

Photo Stories