Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 2, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 2nd 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 2nd 2023 Current Affairs

WPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను నియమించారు. భారత కెప్టెన్‌ అయిన హర్మన్‌ప్రీత్‌ ఇటీవల టి20 ప్రపంచకప్‌ సందర్భంగా 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆధ్వర్యంలో డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది. లీగ్‌ తొలి రోజు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఆడుతుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా అశ్విన్ 
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ నంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో నిలిచాడు. మార్చి 1వ తేదీ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను రెండో స్థానానికి పంపించి అశ్విన్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల  అశ్విన్‌  తొలిసారి 2015లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్‌ ర్యాంక్‌లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్ కంటే ముందు ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్‌లు ఆడిన అశ్విన్‌ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్‌ 864 రేటింగ్‌ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా.. అండర్సన్‌ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్‌ మూడో స్థానానికి చేరుకోగా.. భారత్‌కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, షాహీన్‌ అఫ్రిది (పాకిస్తాన్‌) ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్‌ రెండో స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఐదో స్థానంలో ఉన్నారు.   

ATP Rankings: జొకోవిచ్‌ ‘నంబర్‌వన్‌’ రికార్డు

GST Collections: కేవ‌లం ఒక్క నెల‌కే.. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు.. 
భారత్‌ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో 2022 ఇదే నెలతో పోల్చితే 12 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ ఆర్థిక క్రియాశీలత, వినియోగ వ్యయాల పటిష్టత దీనికి కారణం. అయితే 2023 జనవరితో పోల్చితే (రూ.1.55 లక్షల కోట్లు. జీఎస్‌టీ ప్రవేశపెట్టిన 2017 జూలై 1 తర్వాత రెండవ అతి భారీ వసూళ్లు) వసూళ్లు తగ్గడం గమనార్హం. అయితే ఫిబ్రవరి నెల 28 రోజులే కావడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
విభాగాల వారీగా చూస్తే.. 
☛ మొత్తం రూ.1,49,577 కోట్ల వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.27,662 కోట్లు.  
☛ స్టేట్‌ జీఎస్‌టీ రూ.34,915 కోట్లు. 
☛ ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.75,069 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.35,689 కోట్లుసహా). 
☛ సెస్‌ రూ.11,931 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.792 కోట్లుసహా). కాగా, జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత సెస్‌ వసూళ్లు ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి.  
☛ ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
2022 ఏప్రిల్‌ నుంచి ఇలా.. 

నెల

జీఎస్టీ ఆదాయం (రూ.కోట్లలో)

ఏప్రిల్‌ 2022

1,67,650

మే

1,40,885

జూన్

1,44,616

జూలై

1,48,995

ఆగస్టు

1,43,612

సెపె్టంబర్

1,47,686

అక్టోబర్

1,51,718

నవంబర్

1,45,867

డిసెంబర్

1,49,507

జనవరి 2023

1,55,922

ఫిబ్రవరి

1,49,577



Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..
భారత దేశం బ్యాంకింగ్ రంగంలో 120 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ప్రైవేటు లెండర్ సిటీ బ్యాంక్ (Citi Bank) ప్రస్తానం ముగిసింది. ఈ బ్యాంక్ ఇకపై మ‌న‌కు కనిపించదు. సిటీ బ్యాంక్ 1902లో కోల్‌క‌తాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. విదేశీ సంస్థ సిటీ బ్యాంకు రిటైల్‌ బిజినెస్‌ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్‌ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్‌ ప్రకారం తుదిగా రూ.11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్‌ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్‌ సిటీ కస్టమర్లను యాక్సిస్‌ పొందింది.
డీల్‌ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్‌ ఖాతాలు, చెక్‌ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్‌ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్‌ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్‌ మరో 2.5 మిలియన్‌ క్రెడిట్‌ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ.4 లక్షల కోట్ల రిటైల్‌ బుక్‌ కలిగిన యాక్సిస్‌ సిటీబ్యాంక్‌ ఇండియాకు చెందిన 3 మిలియన్‌ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్‌ బ్యాంక్‌ వినియోగించుకోనుంది. 

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌..

Cabinet Committee: రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు 
భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్‌ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ(సీసీఎస్‌) మార్చి 1న‌ ఆమోదం తెలిపింది. రానున్న ఆరేళ్లలో ఈ  విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. 
తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన  శిక్షణ  ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్‌ఏఎల్‌ సంస్థ ప్రైవేట్‌ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.   

Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్

Anti Corruption: గురుగ్రాంలో జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్ సదస్సు

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు ద్వైపాక్షిక సహకారం చాలదని, ఈ దిశగా దేశాలన్నీ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటేనే ఫలితముంటుందని భారత్‌ పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట నిబంధనలు తదితరాలను తక్షణం సరళీకరించుకోవాలంది. మార్చి 1వ తేదీ హరియాణాలోని గురుగ్రాంలో మొదలైన జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్‌ రెండు రోజుల సదస్సులో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు సూచించారు. విజయ్‌ మాల్యా మొదలుకుని నీరవ్‌ మోదీ దాకా పలువురు ఆర్థిక నేరగాళ్లను రప్పించి చట్టం ముందు నిలబెట్టేందుకు భారత్‌ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
‘‘ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు తరలించిన మొత్తాలు ఉగ్రవాదం మొదలుకుని మనుషుల అక్రమ రవాణా తదితరాలకు వనరులుగా మారుతున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాప్తికి, ప్రజాస్వామిక ప్రభుత్వాలను బలహీనపరచడానికీ ఉపయోగపడుతున్నాయి’’ అంటూ మంత్రి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అందుకే ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను వీలైనంత త్వరగా ప్రభుత్వాలు రికవర్‌ చేసుకోవాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలన్నీ పని చేయాలి.  జీ–20 దేశాలు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలి’’ అని సూచించారు.

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి విదేశాల్లోనూ జెడ్‌ ప్లస్‌ భద్రత 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు భారత్‌లోనే గాక విదేశాల్లోనూ జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అందుకయ్యే ఖర్చులను అంబానీయే భరించాలని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారీ, జస్టిస్‌ అహ్సనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Export Council: అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు
అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌కు కార్పోరేట్‌ రంగానికి చెందిన పునీత్‌ రంజన్, రాజేశ్‌ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్ మార్చి 1వ తేదీ ప్రకటించింది. రంజన్‌ గతంలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు. ఫెడ్‌ఎక్స్‌కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్‌ కొనసాగుతున్నారు. 
సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Vande Bharat: రూ.120 కోట్లతో ‘వందేభారత్‌’ 
200 వందేభారత్‌ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించగా, రష్యాకు చెందిన సీజేఎస్సీ ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్, భారత్‌కు చెందిన రైలు వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(టీఎంహెచ్‌–ఆర్‌వీఎన్‌ఎల్‌) కన్సార్టియం లోయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్, టిటాగఢ్‌ వ్యాగన్స్‌ కన్సార్టియం రెండో లోయెస్ట్‌గా అవతరించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐసీఎఫ్‌–చెన్నై ఒక్కో వందేభారత్‌ రైలును రూ.128 కోట్లతో తయారు చేసింది. తాము రూ.120 కోట్లతోనే తయారు చేస్తామని టీఎంహెచ్‌–ఆర్‌వీఎన్‌ఎల్‌ కన్సార్టియం వెల్లడించింది. ఇక బీహెచ్‌ఈఎల్‌–టిటాగఢ్‌ వ్యాగన్స్ కన్సార్టియం ఒక్కో రైలును రూ.140 కోట్లతో తయారు చేసేందుకు ముందుకొచ్చింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
   

Published date : 02 Mar 2023 06:14PM

Photo Stories