Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 29, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 29th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 29th 2023 Current Affairs

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు..  
యూపీఐ యూజర్లు ఇక‌పై చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏప్రిల్ మొద‌టి నుంచి మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ఫీజు వసూలు చేయనున్న‌ట్లు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవ‌ల ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే కొన్ని రకాల చెల్లింపులపై యూపీఐ ద్వారా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు వసూలు చేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది. ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు వర్తిస్తుంది.

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

ప్రీపెయిడ్‌ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్‌ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్‌ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్‌ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. అయితే గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

Karnataka Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ మార్చి 29న‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. కర్నాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను మరింత పెంచేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తోంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు(ఓట్‌ ఫ్రమ్‌ హోం) సదుపాయం కల్పించ‌నున్న‌ట్లు ఈసీ స్పష్టం చేసింది. 
ఓటర్ల వివ‌రాలు..
కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానం. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 12.15 లక్షలు ఉంది.   41,312 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్‌ స్థానాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కర్నాటకలో 58,282 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. మార్చి 29 నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

ఎన్నికల షెడ్యూలిదే.. 
► ఏప్రిల్‌ 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌.
► అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు ఏప్రిల్‌ 20 చివరి తేదీ. 
► ఏప్రిల్‌ 21న నామినేషన్ల పరిశీలన. 
► ఏప్రిల్‌ 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ. 
► మే 10న పోలింగ్‌.. 13న ఓట్ల లెక్కింపు. 

G20 Summit 2023: విశాఖపట్నంలో జీ–20 సదస్సు..  
విశాఖపట్నంలో మార్చి 28 నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరుగున్నాయి. ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో మార్చి 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరుగుతుంది. నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. జి–20 సమావేశాలు పురస్కరించుకుని రూ.157 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. కాగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

తొలిరోజు నాలుగు సెషన్లు
జీ20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు మార్చి 28న‌ విశాఖ సాగర తీరంలో ఘనంగా ప్రారంభమైంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో తొలిరోజు నాలుగు సెషన్లు నిర్వహించగా 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులను పెంచడం తదితర అంశాలపై చర్చించారు. 

Amplus Solar: ఆంధ్రప్రదేశ్‌లో.. రూ. 1,750 కోట్ల పెట్టుబడులు

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్..  

ఐపీఎల్ 2023 అభిమానులకు గంతంలో కంటే మ‌రింత కిక్‌ను ఇవ్వ‌బోతోంది. మార్చి 31 నుంచి జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ సీజన్‌లో బీసీసీఐ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. గ‌త ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో, గుజరాత్ జట్లను కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. 

టాస్ తర్వాత తుది జట్టు..
ఇప్పటిదాకా 11 మంది జట్టు సభ్యులను టాస్‌‌‌‌‌‌‌‌కు ముందే ప్రకటించాల్సి ఉండే రూల్‌‌‌‌‌‌‌‌ను క్లాజ్‌‌‌‌‌‌‌‌ 1.2.1 ప్రకారం బీసీసీఐ మార్చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రిఫరీకి సమర్పించే 11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. అంతకుముందే జట్టును ప్రకటించినా సరే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను, ఓడితే మరో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు.

South Africa: టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అత్య‌ధిక‌ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా

మరోవైపు బౌలర్‌‌‌‌‌‌‌‌ నిర్దిష్ట టైమ్‌‌‌‌‌‌‌‌లో తన ఓవర్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయకపోతే.. ఓవర్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించనున్నారు. ఈ పెనాల్టీ వల్ల 30 యార్డ్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వెలుపల నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి ఫీల్డర్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ అనవసరంగా/అనైతికంగా తమ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ మార్చుకుంటే ఆ బంతిని డెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించి ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధిస్తారు. ఈ ఐపీఎల్ నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

 WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌ తొలి విజేతగా ముంబై ఇండియన్స్..  
Toll Plaza Charges: ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ‘టోల్’ చార్జీలు..!
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) టోల్ చార్జీలను 5 నుంచి 10 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (ద్వి, త్రిచ‌క్ర వాహ‌నాలు మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెర‌గ‌నున్నాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

ఏడాదికోసారి సవరణ..
2008 నేషనల్‌ హైవేస్‌ ఫీజ్‌ ప్రకారం టోల్ చార్జీలను ఏడాదికోసారి కేంద్ర రవాణ శాఖ సవరిస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు, ఆయా రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల ఆధారంగా ధరలను సవరిస్తారు. ఈ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ఎన్‌హెచ్ఏఐ పంపుతుంది. దీనిపై ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలు తీసుకుని మార్చి నెల చివ‌ర‌న నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. 

BWF Badminton Rankings: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10 నుంచి పీవీ సింధు అవుట్‌..  
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 2016 నవంబర్‌ తర్వాత తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో చోటు కోల్పోయింది. స్విస్‌ ఓపెన్‌లో సింధు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవ‌డం ఈ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. మార్చి 28న‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది సింధు నాలుగు టోర్నీలలో పాల్గొని మూడింటిలో తొలి రౌండ్‌లో ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్ర‌మించింది. 

Boxing World Championship: ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా భారత్..

భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్‌ ఒక స్థానం ఎగబాకి 31వ ర్యాంక్‌లో నిలిచింది. జనవరిలో ఇండోనేసియా ఓపెన్‌ తర్వాత సైనా మరో టోర్నీలో ఆడలేదు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. కిదాంబి శ్రీకాంత్‌ 21వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్‌ 25వ ర్యాంక్‌లో నిలిచారు.  

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ చాంపియన్‌గా భారత్‌ 
ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మార్చి 28న‌ జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–0 గోల్స్‌ తేడాతో కిర్గిజ్‌ రిపబ్లిక్‌ జట్టుపై గెలిచింది. భారత్‌ తరఫున సందేశ్‌ జింగాన్‌ (34వ ని.లో), సునీల్‌ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. సునీల్‌ చెత్రి కెరీర్‌లో ఇది 85వ గోల్‌. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–0తో విజయం సాధించింది.    

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 29 Mar 2023 06:42PM

Photo Stories