Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 27, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 27th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 27th 2023 Current Affairs

LVM3 Rocket: వన్‌వెబ్‌ ఇండియా–2 ఉపగ్రహాల ప్రయోగం విజ‌య‌వంతం..  
ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్‌ ఇండియా–2 ఇంటర్నెట్‌ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి అత్యంత బరువైన ఎల్‌వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్‌ వాటిని తీసుకుని మార్చి 26వ తేదీ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్‌ వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్, ఇండియన్‌ భారతి ఎంటర్‌ ప్రైజెస్‌ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్‌ ఎర్త్‌ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్‌ నుంచి సిగ్నల్స్‌ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్‌ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్‌ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. 

chandrayaan-3: ‘చంద్రయాన్‌–3’ ప్రీలాంచ్‌ పరీక్ష విజయవంతం
 
World's Loneliest Orca: ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం.. 'కిస్కా' కథ ముగిసిందిలా..! 

ఓర్కా రకం కిల్లర్‌ వేల్ కిస్కా.. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్‌ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్‌ వేల్‌ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్‌ జూ పార్క్‌కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. 

Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!
‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్‌ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్‌ జస్టిస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కెమిల్లె లబ్చుక్‌ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Light Pollution: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు.. పరిష్కారం ఏమిటి?
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్‌ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్‌ అ్రస్టానమీ’ పత్రికలో ప్రచురించారు. 
రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్‌ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్‌ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్‌ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్‌ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్‌ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అ్రస్టానామికల్‌ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. 

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..
పరిష్కారం ఏమిటి? 
కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్‌నెస్‌ తగ్గించాలి. టెలిస్కోప్‌ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్‌ ట్రాఫిక్‌ మరో పెను సమస్య. 

Breast Cancer: బర్త్‌ కంట్రోల్‌ మాత్రలతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు!

 
Boxing World Championship: ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా భారత్.. రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలుగ‌మ్మాయి..

సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. మార్చి 25న నీతూ (48 కేజీలు), స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా.. మార్చి 26న నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు) ‘గోల్డెన్‌’ ఫినిషింగ్‌ ఇచ్చారు. 
స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్ (తెలంగాణ అమ్మాయి) వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో మార్చి 26న‌ ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్‌ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్‌ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. 

Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీల‌క నిర్ణ‌యం!

‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డు..
టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్‌’ వాహనం లభించింది.   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి


WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌ తొలి విజేతగా ముంబై ఇండియన్స్..  

తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తుది పోరులోనూ సమష్టి ప్రదర్శనతో అదే జోరును కొనసాగించింది. మార్చి 26న‌ జరిగిన ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నాట్‌ సివర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు) నిలిచారు.  

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ లీగ్‌లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ.6 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ(రూ. 3.4 కోట్లు) కంటే దాదాపు  రెట్టింపు. రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజేతల్లో సగం (రూ.3 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Swiss Open Title: సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌

భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్‌–చిరాగ్‌ గుర్తింపు పొందింది. మార్చి 26న హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్‌–చిరాగ్‌ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్‌ జియాంగ్‌ యు–టాన్‌ కియాంగ్‌ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్‌ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్‌. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 16,590 డాలర్ల (రూ.13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 
☛ సాత్విక్‌–చిరాగ్‌ కెరీర్‌లో గెలిచిన వరల్డ్‌ టూర్‌ డబుల్స్‌ టైటిల్స్ 5. స్విస్‌ ఓపెన్‌ కంటే ముందు ఈ జంట హైదరాబాద్‌ ఓపెన్‌ (2018), థాయ్‌లాండ్‌ ఓపెన్‌ (2019), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2022), ఇండియా ఓపెన్‌ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. 
☛ స్విస్‌ ఓపెన్‌లో భారత్‌ ప్లేయర్లకు టైటిల్‌ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2011, 2012), పీవీ సింధు (2022).. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (2015), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2016), సమీర్‌ వర్మ (2018).. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ (2023) విజేతగా నిలిచారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌కు రెండో స్థానం..  

భోపాల్‌లో జరిగిన‌ ప్రపంచకప్‌ షూటింగ్ టోర్న‌మెంట్‌లో భార‌త్ రెండ‌వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా భార‌త్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలను సాధించింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. చివరిరోజు మార్చి 26న మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో సిఫ్ట్‌ కౌర్‌ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్‌ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో సిఫ్ట్‌ కౌర్‌ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్‌ కౌర్‌కిది రెండో ప్రపంచకప్‌ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది.   
మనూ భాకర్‌కు కాంస్యం 
మార్చి 25న జ‌రిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.  

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా అశ్విన్

BCCI Contracts 2022-23: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన..  
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రమోషన్‌ సాధించి ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేఎల్‌ రాహుల్‌ ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉండగా, ఇప్పుడు ‘బి’కి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న అక్షర్‌ పటేల్‌కు ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోషన్‌ లభించగా, ఇటీవలే ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్‌ (సి గ్రేడ్‌) దక్కింది. మరో వైపు సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు.  
కాంట్రాక్ట్‌ జాబితా (మొత్తం 26 మంది)  
‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ (రూ.7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. 
‘ఎ’ గ్రేడ్‌ (రూ.5 కోట్లు): హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌. 
‘బి’ గ్రేడ్‌ (రూ.3 కోట్లు): పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌. 
‘సి’ గ్రేడ్‌ (రూ.1 కోటి): ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

South Africa: టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అత్య‌ధిక‌ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా 
అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా కొత్త రికార్డు సృష్టించింది. మార్చి 26న‌ జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (46 బంతుల్లో 118; 10 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు వేగంతో 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అనంతరం సఫారీ టీమ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్‌ డి కాక్‌ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్‌డ్రిక్స్‌ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. దాంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా రికార్డు విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ఛేదన రికార్డు ఆ్రస్టేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్‌ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది.   

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

Published date : 27 Mar 2023 07:16PM

Photo Stories