Daily Current Affairs in Telugu: మార్చి 22, 2023 కరెంట్ అఫైర్స్

Earthquake: ఉత్తరాదిన పెను భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదు
దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మార్చి 21వ తేదీ రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా రికార్డయ్యింది. అఫ్గానిస్తాన్‌లోని హిందూకుష్‌లో భూఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలియజేసింది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. అఫ్గానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది.
XBB1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్
పాక్, అఫ్గాన్‌లో భారీ ప్రకంపనలు
భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లోనూ బలమైన భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇది రిక్టర్ స్కేల్‌పై 6.8గా రికార్డయ్యింది. పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్‌పురా, స్వాత్, ముల్తాన్, షాంగ్లా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం అందలేదు. పాకిస్తాన్ భూకంప ప్రభావిత దేశమే. దేశంలో 2005లో సంభవించిన భూకంపం వల్ల 74,000 మంది మృతిచెందారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
BJP: ప్రపంచంలో అత్యంత కీలకమైన పార్టీ బీజేపీ
ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అని, ప్రఖ్యాత అమెరికన్ మ్యాగజైన్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం పేర్కొంది. వాల్టర్ రసెల్ మెడ్ రాసిన ఈ వ్యాసంలో భారత్‌లో అధికార బీజేపీ అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణంలో గమనిస్తే అత్యంత ముఖ్యమైన పార్టీగా అభివర్ణించారు. ఇంకా అందులో ఏం రాశారంటే..‘‘2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన బీజేపీ 2024లో మరోసారి విజయాన్ని దక్కించుకోవడం ఖాయం. జపాన్‌తో సమానమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోంది. శక్తిమంతమైన చైనాతో సమతుల్యత సాధించడానికి అమెరికా కృషి చేస్తూ ఉంటే, ఎవరి సాయం లేకుండా బీజేపీ తాను కోరుకున్న భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటోంది. బీజేపీ శక్తి ఏమిటో ప్రపంచ దేశాలు చాలా తక్కువగా అర్థం చేసుకున్నాయి. ఎందుకంటే ఆ పార్టీకున్న చరిత్ర, సంస్కృతి భారతీయులు కానివారికి అంతగా తెలీదు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మాదిరిగానే వంద కోట్లకు పైగా జనాభాని పాలించి గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదగాలన్నదే బీజేపీ ధ్యేయం’’ అంటూ ఆ వ్యాసం సాగింది.
Global Millets Conference: ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలే పరిష్కారం.. మోదీ
Donald Trump: ట్రంప్ అరెస్టవవుతాడా.. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి..?
నన్ను అరెస్ట్ చేస్తారంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కల్లోలం రేగింది. శృంగార తారతో లైంగిక సంబంధాల్ని పెట్టుకొని 2016 ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరెత్తకుండా ట్రంప్ భారీగా డబ్బులు ముట్టజెప్పారన్న కేసును న్యూయార్క్ జ్యూరీ గత కొన్ని వారాలుగా రహస్య విచారణ సాగిస్తోంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ఆయనపై నేరాభియోగాలు నమోదవుతాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి?
డొనాల్డ్ ట్రంప్ లైంగిక సంబంధాల ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2006 ఏడాదిలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ట్రంప్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియెల్స్ ఒకప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. ట్రంప్ నిర్వహించే రియాల్టీ షో ‘ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి తనతో గడిపారని ఆరోపణలు గుప్పించారు. అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి హనీబంచ్ అని ముద్దుగా పిలిచేవారని చెప్పుకొచ్చారు.
US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. ట్రంప్‌కి పోటీగా ఆయన వీరవిధేయులే!
2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలపై నోరెత్తకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కొహెన్ తొలుత ఈ డబ్బులు డేనియెల్స్‌కు చెల్లిస్తే, ఆ తర్వాత ట్రంప్ మైఖేల్‌కి డబ్బులు ఇచ్చారు. మైఖేల్ తనకు డబ్బులు ఇచ్చినట్టుగా డేనియల్స్ చెబుతూ ఉంటే, అవి లాయర్‌కి ఫీజు చెల్లించినట్టుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Indian Consulate: కాన్సులేట్‌పై దాడి ఘటనలో అమెరికా ఆగ్రహం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌పై ఖలిస్తానీవాదులు దాడికి తెగబడిన ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఇలాంటి ఘటనలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’ అని వైట్‌హౌజ్‌లో జాతీయ భద్రతా మండలి సంధానకర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ ఆక్షేపించారు. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున కాన్సులేట్‌కు ఇద్దరు ఖలిస్తానీ సానుభూతిపరులు నిప్పుపెట్టేందుకు విఫలయత్నం చేశారు. అదే రోజు మధ్యాహ్నం మళ్లీ అక్కడికి చేరుకున్న ఇంకొందరు ఖలిస్తానీవాదులు ఖలిస్తాన్ జెండాలు పాతి, ఇనుప కడ్డీలతో తలుపు, కిటికీలు బద్దలుకొట్టారు. ఈ దాడి ఘటనలో కాన్సులేట్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి.
‘ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తాం. భారత కాన్సులేట్‌కు భద్రత, సిబ్బందికి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తాం’ అని కిర్బీ ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేదిలేదంటూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్ ట్వీట్ చేశారు. కాన్సులేట్ ఎదుట నిరసనలు చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తంచేయడంతో సలివాన్ పైవిధంగా స్పందించారు. పాస్‌పోర్ట్‌లు, వీసాల కోసం కాన్సులేట్‌కు వచ్చిన పౌరులను వేర్పాటువాదులు వేధించారని భారతీయ అమెరికన్లు ఆరోపించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Mehul Choksi: మెహుల్ చోక్సీపై రెడ్‌కార్నర్ నోటీస్ ఎత్తివేత !
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఇంటర్‌పోల్ గతంలో జారీచేసిన రెడ్‌కార్నర్ నోటీసును ఇటీవల ఎత్తేసిన విషయం తాజాగా వెలుగులోకి రావడంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘విపక్షాలపైకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐను కేంద్రం ఉసిగొల్పుతూ తమ మిత్రుడిని వదిలేసింది. ఇలాంటి వ్యక్తులను పరిరక్షించే బీజేపీ పెద్దలు దేశభక్తి గురించి మాట్లాడటం.. నిజంగా ఒక పెద్ద జోక్’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా, ఇంటర్‌పోల్ తన డాటాబేస్ నుంచి చోక్సీ పేరును తొలగించడాన్ని సీబీఐ తప్పుబట్టింది. ఆయన పేరును మళ్లీ చేర్చి రెడ్‌కార్నర్ నోటీసును పునరుద్ధరించాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. పేరు తొలగించాలని పలుమార్లు చోక్సీ కోరడంతో ఇంటర్‌పోల్‌లోని స్వతంత్ర సీసీఎఫ్ విభాగం ఆ పనిచేసింది.
International Criminal Court: పుతిన్‌ను బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా.. అసలు పుతిన్‌పై ఉన్న ఆరోపణలేంటి?
Lok Sabha: రూ.1.48 లక్షల కోట్ల అనుబంధ పద్దుకు ఆమోదం
ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.48 లక్షల కోట్ల అదనపు నిధుల ఖర్చుకు సంబంధించిన అనుబంధ పద్దుకు మార్చి 21న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అదానీ షేర్ల వివాదంపై విపక్ష పార్టీల నిరసనల నినాదాల మధ్యే ఈ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మొత్తం రూ.2.7 లక్షల కోట్ల అదనపు పద్దును 13వ తేదీనే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదనపు పద్దుకు సంబంధించి రూ.36,325 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చుచేయనుంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సంబంధిత మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.33,718 కోట్ల బకాయిలను ప్రభుత్వం మొత్తం పద్దులో కలిపింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం
పిల్లలకు మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో 15 రకాల ఆహార పదార్థాలను గోరుముద్ద ద్వారా అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి. ఇప్పుడు గోరుముద్ద కోసం ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని మార్చి 21న తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
మొదటి రోజు నుంచే..
అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి చదువులను సంస్కరించడంపై దృష్టి పెట్టాం. అందులో భాగంగానే గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, విద్యాకానుక, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. 8వ తరగతిలోకి వచ్చిన వెంటనే పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇక 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ ప్యానెల్స్) ద్వారా డిజిటల్ బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాడు – నేడు పూర్తైన స్కూళ్లలో జూన్ నుంచి అమలులోకి తీసుకొస్తాం. ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం.
మరింత బలవర్ధకంగా గోరుముద్ద
గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో రుచికరంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత బలవర్ధకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇవాళ్టి నుంచి పిల్లలకు రాగిజావ కూడా అందిస్తూ గోరుముద్దను మరింత పుష్టికరంగా తీర్చిదిద్దుతున్నాం. రాగి జావ పిల్లల్లో సమృద్ధిగా ఐరన్, కాల్షియం కంటెంట్ పెరిగేలా దోహదపడుతుంది. మిడ్ డే మీల్స్ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి రూ.450 కోట్లు కూడా మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేయని దుస్థితి.
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం
అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనూతో పూర్తిగా మార్చి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో రూ.450 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్‌ను ఇప్పుడు ఏడాదికి రూ.1,824 కోట్లకు పెంచి గోరుముద్ద కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు రాగి జావ కోసం అదనంగా మరో రూ.86 కోట్లు ఇస్తున్నాం. రోజుకో మెనూతో పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నాం.
సత్యసాయి ట్రస్టు సహకారంతో..
పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామి కావడం నిజంగా మంచి పరిణామం. ఏటా దాదాపు రూ.86 కోట్లు ఖర్చయ్యే రాగి జావ కోసం సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు అందిస్తుండగా మిగిలిన రూ.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరుస్తూ మంచి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నాం.
Mega Textiles Park: తెలంగాణలో టెక్స్‌టైల్ పార్కు.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు
Amplus Solar: ఆంధ్రప్రదేశ్‌లో.. రూ. 1,750 కోట్ల పెట్టుబడులు
ఇటీవల గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌తో ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్ సోలార్ రూ.1,500 కోట్లు, ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. 7.5 కేపీటీఏ (వార్షికంగా కిలో టన్నులు) సామర్థ్యంతో హరిత హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు యాంప్లస్ సోలార్ తెలిపింది. పారిశ్రామిక వినియోగ అవసరాల కోసం వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో శరద్ పుంగాలియా వివరించారు. అంతర్జాతీయ హరిత హైడ్రోజన్ హబ్‌గా ఎదగాలన్న భారత లక్ష్య సాకారంలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆ దిశగా ఈ ఎంవోయూ తొలి అడుగు అని శరద్ చెప్పారు. పెట్రోకెమికల్స్, సిమెంటు, ఎరువులు తదితర రంగాల సంస్థలకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక హబ్‌గా మారిన నేపథ్యంలో ఆయా పరిశ్రమల అవసరాల కోసం పునరుత్పాదకత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. యాంప్లస్ పోర్ట్‌ఫోలియోలో 1.4 గిగావాట్ల సోలార్ అసెట్లు ఉన్నాయి.
JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ
కడపలో ఎలిస్టా ప్లాంటు..
దేశీయంగా అమ్మకాలు, ఎగుమతుల కోసం కడపలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా వెల్లడించింది. దీనిపై వచ్చే అయిదేళ్లలో దశలవారీగా రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఎండీ సాకేత్ గౌరవ్ తెలిపారు. తొలుత రూ.50 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంటులో ఏటా పది లక్షల పైచిలుకు స్మార్ట్ యూనిట్లు, మానిటర్లను తయారు చేయనున్నట్లు ఆయన వివరించారు. అ తర్వాత ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు వంటి గృహోపకరణాల విభాగాల్లోకి కూడా ప్రవేశించనున్నట్లు గౌరవ్ చెప్పారు. ప్రస్తుతం రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్న తమ ఆదాయాలు ఈ ప్లాంటు పూర్తిగా అందుబాటులోకి వస్తే రూ. 1,500 కోట్లకు చేరగలవని ఆయన పేర్కొన్నారు. దీనితో 500 పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లాంటు నుంచి వచ్చే ఆదాయంలో 60 శాతం వాటా ఎగుమతుల మార్కెట్ నుంచే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు గౌరవ్ తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన టెక్నోడోమ్ గ్రూప్‌లో భాగంగా 2020లో ఎలిస్టా ఏర్పాటైంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)