Daily Current Affairs in Telugu: మార్చి 21, 2023 కరెంట్ అఫైర్స్

Motorbike Usage: ద్విచక్ర వాహనాలను అధికంగా వినియోగిస్తున్న దేశాలివే..
ప్రపంచంలో ద్విచక్ర వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా నిర్వహించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా మోటార్ బైక్‌లను ఉపయోగిస్తున్న దేశం థాయ్‌లాండ్. ఆ దేశ జనాభాలో దాదాపు 87% మంది కనీసం ఓ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు.
ఈ సర్వే ప్రకారం థాయిలాండ్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో వియాత్నం(86%) ఉంది. తరువాతి స్థానాల్లో వరుసగా ఇండోనేషియా(85%), మలేషియా(83%), చైనా(60%), భారతదేశం(47%), పాకిస్తాన్(43%), నైజీరియా(35%), పిలిప్పీన్స్(32%), బ్రెజిల్(29%), ఈజిప్ట్(28%), ఇటలీ(26%), ట్యునీషియా(25%), అర్జెంటీనా(24%), కొలంబియా(23%) ఉన్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Fumio Kishida India Visit: జపాన్‌తో బంధం బలోపేతం.. కిషిదా, మోదీ చర్చలు
భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాలు మార్చి 20న ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషి చేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు.
India-Australia: రక్షణ బంధం బలోపేతం.. ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్
‘జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే. ఇండో–పసిఫిక్ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
‘భారత్‌తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ వృద్ధికేకాదు జపాన్ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా తెలిపారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
పలు ఒప్పందాలపై సంతకాలు
ఇరు దేశాలపై ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్‌వేర్‌ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్ యెన్‌ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
Assembly Elections: నిరుద్యోగులకు రూ.3,000.. ఎక్కడో తెలుసా..?
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.3,000, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘‘యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తాం. 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీచేస్తాం’ అని హామీ ఇచ్చారు. మార్చి 20వ తేదీ బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభ ఆయన ప్రసంగించారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతీ సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇప్పటికే మూడు హామీలు ప్రకటించింది. నిరుద్యోగ భృతి నాలుగో హామీ ఇచ్చింది.
Ladli Behna Yojana: మహిళల కోసం ‘లాడ్లి బెహనా’ యోజన
Global Warming: వేడి అలలు.. జీవ జాలానికి ఉరితాళ్లు!
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూ ఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు.
Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!
ఏమిటీ భూతాపం?
శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్పన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Antarctic Sea: అంటార్కిటికా కరిగిపోతోంది.. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు..!
Amritpal Singh: అమృత్‌పాల్‌కు ఐఎస్‌ఐ లింకులు.. కోట్లాదిగా విదేశీ నిధులు!
ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్‌పాల్ దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా ఉండగా అతనికి ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు.
International Criminal Court: పుతిన్‌ను బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా.. అసలు పుతిన్‌పై ఉన్న ఆరోపణలేంటి?
‘‘భారత్‌లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్‌పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్‌దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్‌ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్‌ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు.
ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్‌పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు మార్చి 19న అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు పెట్టారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Xi Jinping: రష్యాలో జిన్‌పింగ్ అధికారిక పర్యటన
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మార్చి 20న రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఒత్తిడి!
ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ మార్చి 20న చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరు దేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మూడోసారి అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
DY Chandrachud: ‘సహజీవనం’ పిల్ కొట్టివేత
సహజీవన బంధాన్ని ‘గుర్తించి’ కేంద్రం తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌ను మార్చి 20న సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘‘ఇదో తెలివితక్కువ వ్యాజ్యం. వాటిని రిజిస్టర్ చేసి కేంద్రం మాత్రం ఏం చేస్తుంది?’’ అంటూ పిటిషనర్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తలంటారు. బాల్య వివాహాల చట్టం, రజస్వల అయిన బాలికకు పెళ్లిని అనుమతిస్తున్న ముస్లిం చట్టాల మధ్య ఘర్షణ తలెత్తితే ఏం చేయాలన్న అంశాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
Same Sex Marriage: స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే!
ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?
మాజీ సైనికోద్యోగుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతేడాది తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓఆర్‌ఓపీ బకాయిలపై భారీ మాజీ సైనికోద్యోగుల ఉద్యమం (ఐఈఎస్‌ఎం) పిటిషన్‌పై మార్చి 20న ధర్మాసనం విచారణ జరిపింది. బకాయిల చెల్లింపునకు కాలావధిని ఖరారు చేసింది. దీనిపై కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించిన నోట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సంస్కృతి సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి తెర పడాలన్నారు. ‘‘వ్యక్తిగతంగా కూడా సీల్డ్ కవర్లకు నేను వ్యతిరేకిని. కోర్టులో పారదర్శకత చాలా ముఖ్యం. అంతిమంగా ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. అందులో రహస్యమేముంటుంది?’’ అని ప్రశ్నించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
FEATURE RACE: జెహాన్ దారువాలాకు మూడో స్థానం
ఫార్ములా–2 రేసింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌదీ అరేబియా రేసులో భారత డ్రైవర్ జెహాన్ దారువాలా మూడో స్థానంలో నిలిచాడు. జెడ్డాలో జరిగిన ఈ రేసులో నెదర్లాండ్స్‌కు చెందిన ఎంపీ మోటార్‌స్పోర్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెహాన్ నిర్ణీత 28 ల్యాప్‌లను 50 నిమిషాల 53.133 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని పొందాడు. వెస్టీ (ప్రెమా రేసింగ్) తొలి స్థానంలో, దూహన్ (విర్టోసీ రేసింగ్) రెండో స్థానంలో నిలిచారు. సీజన్‌లో రెండు రేసులు పూర్తయ్యాక జెహాన్ 24 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
Saudi Arabian Grand Prix: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
ఫార్ములావన్ సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. పెరెజ్ నిర్ణీత 50 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 1 గంట 21 నిమిషాల 14.894 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెడ్‌బుల్ జట్టుకే చెందిన వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో, ఆస్టిన్ మార్టిన్ జట్టు డ్రైవర్ అలోన్సో మూడో స్థానంలో నిలిచారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Carlos Alcaraz: ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అల్‌కరాజ్
స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్‌కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. అల్‌కరాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ.10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ మెద్వెదెవ్‌కు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి.
మయామి ఓపెన్‌లోనూ టైటిల్ సాధిస్తేనే..
ఇండియన్ వెల్స్ టోర్నీకి ముందు రెండో ర్యాంక్‌లో ఉన్న అల్‌కరాజ్ తాజా విజయంతో 7,420 పాయింట్లతో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. మార్చి 20న మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్‌కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు.
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం
రిబాకినా తొలిసారి..
ఇండియన్ వెల్స్ ఓపెన్ మహిళల టోర్నీలో కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో రిబాకినా 7–6 (13/11), 6–4తో రెండో ర్యాంకర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా ప్రదర్శనతో రిబాకినా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. విజేత రిబాకినాకు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ సబలెంకాకు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి.