Daily Current Affairs in Telugu: మార్చి 18, 2023 కరెంట్ అఫైర్స్

Mega Textiles Park: తెలంగాణలో టెక్స్‌టైల్ పార్కు.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు
తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్‌టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్ (ఫార్మ్–ఫైబర్–ఫ్యాక్టరీ–ఫ్యాషన్–ఫారిన్) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు మోదీ మార్చి 17న తెలిపారు. తెలంగాణలోని వరంగల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ (లక్నో), మధ్యప్రదేశ్ (ధార్), మహారాష్ట్ర (అమరావతి), తమిళనాడు(విరుదునగర్), కర్ణాటక (కల్బుర్గి), గుజరాత్ (నవ్‌సారీ)ల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి.
ఒక్కో మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండనుంది. అంతేగాక ఒక్కో మెగా టెక్స్‌టైల్ పార్కు సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Ramsahay Yadav: నేపాల్ ఉపాధ్యక్షుడిగా రాంసహాయ్ యాదవ్
నేపాల్ ఉపాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన రాంసహాయ్ ప్రసాద్ యాదవ్(52) ఎన్నికయ్యారు. మార్చి 17న జరిగిన ఎన్నికల్లో 8 పార్టీలతో కూడిన అధికార కూటమి అభ్యర్థి యాదవ్, సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన సమీప ప్రత్యర్థి అష్టలక్ష్మీ శాక్యను ఓడించారు. 2008లో నేపాల్ రిపబ్లిక్‌గా అవతరించాక మూడో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పున్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. నేపాల్ దక్షిణ ప్రాంతంలోని మాధేష్‌లో మెజారిటీ ప్రజలు భారత సంతతి వారే. మాధేషీలకు ప్రత్యేక హక్కుల కోసం 2007లో ఎగసిన ఉద్యమంలో యాదవ్ చురుకైన పాత్ర పోషించారు.
Ram Chandra Poudel: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్!
Xi Jinping: రష్యాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మార్చి 20 నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూ ఏడాది దాటిపోతూ ఉండడంతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం చైనా ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు జిన్ పింగ్ మార్చి 20 నుంచి 22 వరకు మాస్కోలో పర్యటిస్తారు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునీయింగ్ చెప్పారు.
చైనాకు వరసగా మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్ పింగ్ తొలి విదేశీ పర్యటన ఇదే. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన తర్వాత జిన్‌పింగ్ రష్యా పర్యటనకు వెళుతూ ఉండడంతో ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఒత్తిడి పెంచుతున్న అంశాలపై చర్చలు జరుగుతాయని రష్యా ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా, చైనాల స్నేహబంధాన్ని చాటి చెప్పడానికి ఈ సమావేశాన్ని ఇరువురు నేతలు వినియోగించుకోనున్నారు.
Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి
CISF Recruitment: మాజీ అగ్నివీర్‌లకు సీఐఎస్‌ఎఫ్‌లో 10% రిజర్వేషన్
మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్ చట్టం–1968లోని నిబంధనలను సవరించినట్లు వెల్లడించింది. మాజీ అగ్నివీర్‌లకు బీఎస్‌ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ వారం క్రితం ప్రకటించిన కేంద్రం తాజాగా ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అంతేకాకుండా, మొదటి బ్యాచ్ అగ్నివీర్‌లకైతే ఐదేళ్ల వరకు, తర్వాతి వారికి మూడేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుందని వివరించింది. మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్ ఎఫిసియెన్సీ పరీక్ష నుంచి మినహాయింపు కూడా ఉంటుందని తెలిపింది. గత ఏడాది తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన 17.5–21 ఏళ్ల అభ్యర్థు(అగ్నివీర్)లు నాలుగేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. అగ్నివీర్‌లలో 25% మందిని నాలుగేళ్ల తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు.
Money Laundering: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు 3%.. వాటిల్లో 96 శాతం కేసుల్లో నేరనిరూపణ
Air India VRS: ఎయిరిండియాలో మళ్లీ వీఆర్‌ఎస్
ఎయిరిండియా సంస్థ మరోసారి తమ నాన్–ఫ్లయింగ్ సిబ్బంది కోసం స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్‌ఎస్)ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. టాటాల ఆధీనంలోకి వచ్చాక ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వడం ఇది రెండోసారి. 40 ఏళ్లు, ఆపై వయస్సు వారు, సంస్థలో కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పర్మినెంట్ జనరల్ కేడర్ అధికారులకు ఇది వర్తిస్తుందని ఎయిరిండియా తెలిపింది. కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న క్లరికల్, నిపుణులు కాని కేటగిరీల ఉద్యోగులూ వీఆర్‌ఎస్‌కు అర్హులే. మొత్తం 11 వేల మంది ఉద్యోగుల్లో అర్హులైన 2,100 మంది ఏప్రిల్ 30వ తేదీలోగా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించింది.
Ladli Behna Yojana: మహిళల కోసం ‘లాడ్లి బెహనా’ యోజన
Covid Origins: కరోనా వైరస్ గబ్బిలాల నుంచి కాదు.. శునకాల నుంచి వచ్చిందట..!
కరోనా వైరస్ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు. చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్‌లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్ మార్కెట్‌లో అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని తేల్చారు. ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్ మార్కెట్‌లో శాంపిల్స్ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్ ఆందోళనతో వూహాన్ మార్కెట్ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది.
ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్ డాగ్స్ నుంచే మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు.
H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్..
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 796 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటేసింది. హిమాచల్ ప్రదేశ్, పాండుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో కరోనా బారిన పడి ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Hockey India Awards: హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా సవితా పూనియా, హార్దిక్ సింగ్
భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. మార్చి 17న జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Electric Train: మేఘాలయలో పరుగులు పెట్టిన తొలి ఎలక్ట్రిక్ రైలు
మేఘాలయలో మొదటిసారి ఎలక్ట్రిక్ రైలు పరుగులు పెట్టింది. పూర్తి స్థాయి విద్యుదీకరణ కార్యక్రమంలో భాగంగా మేఘాలయలోని దుధ్నయ్ - మెండిపత్తర్ 22.823 ట్రాక్ కిలోమీటర్ల సింగిల్ లైన్ సెక్షన్, అభయపురి - పంచరత్న 34.59 ట్రాక్ కిలోమీటర్ల డబుల్ లైన్ సెక్షన్‌ను మార్చి 15న ప్రారంభించింది. దీంతో నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మరో మైలురాయిని దాటింది. ఈ సెక్షన్లలో విద్యుదీకరణ పనులను సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (CORE) పూర్తి చేసింది. 2030 నాటికి జీరో ఉద్గారాలకు మారే దిశగా భారతీయ రైల్వే వేగంగా పనులు చేయిస్తోంది.
Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం
మేఘాలయలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక రైల్వే స్టేషన్ మెండిపత్తర్. దీనిని 2014లో అప్పటి ప్రధానమంత్రి ప్రారంభించారు. విద్యుదీకరణ పనులు ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు ఇప్పటినుంచి మెండిపత్తర్ నుంచి నడుస్తాయి. రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. మరిన్ని ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు ఈ విభాగాల ద్వారా పూర్తి వేగంతో నడుస్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ పార్సిల్, సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు నేరుగా మేఘాలయ చేరుకోనున్నాయి. విద్యుదీకరణ వల్ల ఈశాన్య భారతదేశంలో రైళ్ల కదలిక గణనీయంగా పెరుగుతుంది. శిలాజ ఇంధనం నుంచి విద్యుత్‌కు మారడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థ సామర్థ్యం కూడా పెరుగుతుంది.