Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 17, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 17th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Ernie Bot: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా ‘ఎర్నీబాట్‌’..! 
మైక్రోసాఫ్ట్‌ సంస్థ తీసుకొచ్చిన‌ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌ ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి పోటీగా చైనా సెర్చ్‌ ఇంజిన్‌ బైదూ కొత్తగా ఏఐ ఆధారిత చాట్‌బాట్ ‘ఎర్నీబాట్‌’ను మార్చి 17న‌ ఆవిష్కరించింది. అయితే, ఇది యూజర్లను నిరాశపర్చింది. ఎర్నీబాట్‌ సంపూర్ణమేమీ కాదని, ఇంకా మెరుగుపరుస్తామని బైదూ సీఈఓ రాబిన్‌ లీ చెప్పారు. ఎర్నీబాట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బైదూ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది. ఎర్నీబాట్‌ను ఉపయోగించుకొనేందుకు ఇప్పటిదాకా 650 కంపెనీలు ముందుకొచ్చాయని రాబిన్‌ లీ తెలిపారు. ఈ చాట్‌బాట్‌ మొదటి వెర్షన్‌ను 2019లో అభివృద్ధి చేశామన్నారు. 

Google V/S ChatGpt: నువ్వా నేనా..? గూగుల్ V/S ChatGpt... వెయ్యి భాష‌ల్లో గూగుల్ స్పీచ్ మోడ‌ల్‌

Ravi Chaudhary: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా చౌధరి 
భారతీయ అమెరికన్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్‌ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన సిఫారసును సెనేట్‌ 65–29 ఓట్ల తేడాతో మార్చి 15న‌ ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం. రవి అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌లో 1993–2015 నుంచి 22 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్‌ స్టాఫ్‌ అసైన్‌మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్‌(ఎఫ్‌ఏఏ)లోని అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్‌గా అఫ్గానిస్తాన్, ఇరాక్‌ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్‌ ఇంజినీర్‌ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు. 

Xi Jinping: చైనా అధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్

Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి
అమెరికా పార్లమెంట్‌ ఎగువసభలో జరిగిన ఓటింగ్‌లో 52–42 ఓటింగ్‌ ఫలితంతో గార్సెట్టి నామినేషన్‌ గండాన్ని విజయవంతంగా గట్టెక్కారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి త్వరలో నియామకం కానున్నారు. తొలిసారిగా 2021 జూలైలో గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్‌ చేస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. లాస్‌ ఏంజెలిస్‌ నగర మాజీ మేయర్‌ అయిన గార్సెట్టిపై పలు లైంగిక వేధింపులు, ఆధిపత్య ధోరణి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లూ అమెరికా నూతన రాయబారి వ్యవహారం సందిగ్ధంగా ఉండటంతో చరిత్రలో తొలిసారిగా 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా భారత్‌లో అమెరికా రాయబారిగా ఎవరూ లేరు. కాగా, బైడెన్‌కు సన్నిహితుడు నూతన రాయబారిగా వస్తుండటంతో భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని భారతీయ అమెరికన్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.  

Li Keqiang: చైనా ప్రధానిగా కియాంగ్

Cheetah Helicopter: కూలిన చీతా హెలికాప్టర్‌.. ఇద్దరు సైన్యాధికారుల దుర్మరణం 
ఇద్దరు సైన్యాధికారులతో ప్రయాణిస్తున్న సైనిక చీతా హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో మార్చి 16న‌ ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌ పైలట్‌గా విధుల్లో ఉన్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ భాను రెడ్డి, కోపైలట్‌గా ఉన్న మేజర్‌ జయంత్‌ ప్రాణాలు కోల్పోయారు. రక్షణ శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ సన్నద్ధతలో భాగంగా హెలికాప్టర్‌ అరుణాచల్‌లోని పశ్చిమ కెమాంగ్‌ జిల్లాలోని సాంగే గ్రామం నుంచి అస్సాంలోని సోనిపట్‌ జిల్లా మిస్సామరికు తిరుగుపయనమైంది. మార్గమధ్యంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)తో హెలికాప్టర్‌ సంబంధాలు తెగిపోయాయి. 9.15 గంటల ప్రాంతంలో బంగ్లాజాప్‌ గ్రామ శివారులోని కొండల్లో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. హెలికాప్టర్‌ కూలిన ఘటనపై ఆర్మీ కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ మొదలుపెట్టింది. 
వీవీబీ రెడ్డి యాదాద్రి జిల్లా వాసి
ఈ ప్రమాదంలో అసువులు బాసిన ఉప్పల వినయ్‌ భానురెడ్డి(వీవీబీ) స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం. 21 సంవత్సరాలుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తూ లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి ఎదిగారు. వినయ్‌ భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  

Google : ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయంతో.. గూగుల్‌ కీలక నిర్ణయం..!

Money Laundering: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు 3%..వాటిల్లో 96 శాతం కేసుల్లో నేరనిరూపణ 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త. విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్‌ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్స్ఛ్ంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్‌ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదల చేసింది. 
ఈడీ గణాంకాల ప్రకారం..
➤ మనీ లాండరింగ్‌ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌– ఎఫ్‌ఐఆర్‌ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి.  
➤ అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్ చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది.  
➤ 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు.   
➤ మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. 
➤ ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. 
➤ ఎఫ్‌ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Pension Bill: ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్‌ బిల్లుకు ఆమోదం 
ఫ్రాన్స్‌ ప్రభుత్వం పెన్షన్‌ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్‌ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ చర్యలు తీసుకున్నారు. రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్‌ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్‌ బోర్న్‌ చట్ట సభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్‌ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Andhra Pradesh Budget 2023‌-24 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ 2023‌-24
సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధాన­మని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడు­తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. జీవనోపాధి, సాధికారత, సామాజిక భద్ర­త, పారిశ్రామికాభివృద్ధే ప్రధానం అని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2023–24 సంవత్సరానికి రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను మార్చి 16న‌ ఆయన శాసన­సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లా­డుతూ.. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనంగా మేనిఫెస్టోను రూపొందించామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరమే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేశామని తెలి­పారు. కోవిడ్‌ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ నాలు­గేళ్లల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

తెలుసుకోండి: Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

Published date : 17 Mar 2023 06:55PM

Photo Stories