Daily Current Affairs in Telugu: మార్చి 16, 2023 కరెంట్ అఫైర్స్

AP Budget 2023-24 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24 ముఖ్యమైన అంశాలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మార్చి 16వ తేదీ (గురువారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
☛ రూ.2,79,279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
☛ రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
☛ మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
☛ రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
☛ ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
☛ జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
☛ ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
☛ ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.46 శాతం
☛ వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
☛ వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
☛ విద్యుత్ శాఖకు రూ.6,546.21 కోట్లు
☛ వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
☛ వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
☛ జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
☛ జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
☛ వైఎస్సార్ - పీఎం బీమా యోజన - రూ.1600 కోట్లు
☛ డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
☛ రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
☛ వైఎస్సార్ కాపు నేస్తం- రూ.550 కోట్లు
☛ జగనన్న చేదోడు రూ.350 కోట్లు
☛ వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
☛ వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
☛ మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ - రూ.50 కోట్లు
☛ వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
☛ లా నేస్తం - రూ.17 కోట్లు
☛ రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
☛ వైఎస్సార్ ఆసరాకు రూ.6,700 కోట్లు
☛ వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1,212 కోట్లు
☛ జగనన్న విద్యా కానుక రూ.500 కోట్లు
☛ స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
☛ నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్) రూ.11,908 కోట్లు
తెలుసుకోండి: Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్ 2023–24
☛ గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సేవలు
☛ జగనన్న తోడు - రూ.35 కోట్లు
☛ ఈబీసీ నేస్తం - రూ.610 కోట్లు
☛ వైఎస్సార్ కల్యాణమస్తు - రూ.200 కోట్లు
☛ వైఎస్సార్ చేయూత - రూ.5000 కోట్లు
☛ అమ్మ ఒడి - రూ.6,500 కోట్లు
☛ మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
☛ ధర స్థిరీకరణ నిధి - రూ.3,000 కోట్లు
☛ వైఎస్సార్ నేతన్న నేస్తం - రూ.200 కోట్లు
☛ మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
☛ జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
☛ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
☛ పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
☛ యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
☛ షెడ్యూల్ కులాల సంక్షేమం - రూ.20,005 కోట్లు
☛ షెడ్యూల్ తెగల సంక్షేమం - రూ. 6,929 కోట్లు
☛ క్రిస్టియన్ కార్పొరేషన్ రూ.115.03 కోట్లు.
☛ వెనుకబడిన తరగతుల సంక్షేమం - రూ. 38,605 కోట్లు
☛ కాపు సంక్షేమం - రూ.4,887 కోట్లు
Union Budget 2023: కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
☛ మైనార్టీల సంక్షేమం- రూ.4,203 కోట్లు
☛ పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
☛ పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
☛ రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
☛ నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు
☛ పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
☛ ఎనర్జీ- రూ.6,456 కోట్లు
☛ గ్రామ,వార్డు సచివాలయ శాఖ - రూ.3,858 కోట్లు
☛ గడపగడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
☛ రవాణా, ఆర్ అండ్ బీ రూ.9,118.71 కోట్లు
తెలుసుకోండి: Telangana Budget 2023-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023-24
AP Socio Economic Survey 2022-23: ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23
సామాజిక ఆర్థిక సర్వే 2022–23ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 15న విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022 – 23 వెల్లడిస్తోంది. అన్ని రంగాల్లో వృద్ధి రేటు దగ్గర నుంచి తలసరి ఆదాయం వరకు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో 13.98 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2022 – 23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.22 శాతం వృద్ధి నమోదు కాగా ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి 15.9 శాతంగా ఉంది. 2021 – 22 (తొలి సవరించిన అంచనాల ప్రకారం) రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,33,837 కోట్లు కాగా 2022–23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.13,17,728 కోట్లకు చేరనుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే నికరంగా రూ.1,83,891 కోట్ల విలువైన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరింది.
చదవండి : Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.26,931 పెరిగి రూ.2,19,518కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే తలసరి ఆదాయంలో వృద్ధి రూ.23,476గా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకుంటోందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
H1-B Visa: ఉద్యోగం పోయిన హెచ్–1బి వర్కర్లకు.. ఆర్నెల్ల గ్రేస్ పీరియడ్
మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్–1బి ఉద్యోగులకు ఊరట లబించింది. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా!
చదవండి: హాఫ్ జీతానికే పనిచేయండి... లేదంటే.. ప్రెషర్స్‌కు ఐటీ కంపెనీ షాక్
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట!
మరోవైపు, ఈబీ–1, ఈబీ–2, ఈబీ–3 కేటగిరీల్లో ఆమోదిత ఐ–140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు.
Google : ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయంతో.. గూగుల్ కీలక నిర్ణయం..!
Arunachal Pradesh: అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం
అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే తప్ప చైనాలో భాగం కాదని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. చైనా, అరుణాచల్ మధ్యనున్న మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్ హగెట్రీ, జెఫ్ మెర్క్‌లీ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా దాన్ని ప్రతిపాదించారు. ‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు ‘క్వాడ్’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ భూభాగాలకు మాండరిన్ భాషలో మ్యాప్‌లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాది పూర్తి
Himalayas: మంచుకొండల్లో మహాముప్పు.. కరిగిపోనున్న హిమానీనదాలు.. మాయమవనున్న సరస్సులు!
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్‌లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Surekha Yadav: ఏషియా తొలి మహిళా లోకోపైలట్‌గా సురేఖ యాదవ్..
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళ లోకోపైలట్‌గా సురేఖ యాదవ్ చరిత్ర సృష్టించింది. షోలాపూర్–ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ) మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో లోకోపైలట్ (డ్రైవర్)గా ఆమె విధులు నిర్వహించారు. షోలాపూర్ నుంచి మార్చి 13 మధ్యాహ్నం సీఎస్‌ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు.
34 సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో వివిధ సేవలందిస్తున్న సురేఖ యాదవ్‌కు గూడ్స్ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న కల నెరవేరిందని, ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షోలాపూర్ నుంచి మార్చి 13 మధ్యాహ్నం టైంటేబుల్ ప్రకారం బయలుదేరిన ఈ రైలును సీఎస్‌ఎంటీకి ఐదు నిమిషాల ముందే చేర్చారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
కత్తిమీద సాములాంటిదే..
ఇక్కడ ఆమెకు ఘన స్వాగత లభించింది. ఖండాలా–కర్జత్ మధ్య ఘాట్ సెక్షన్‌లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదే. ముఖ్యంగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే విద్యుత్ మోటార్లుంటాయి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ.. ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు.
1996 నుంచి..
మహారాష్ట్ర సాతారా జిల్లాలోని సెయింట్ పాల్ స్కూల్‌లో చదువుకున్న సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. 1989లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా నియమితులయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని 1996లో గూడ్స్ రైలు డ్రైవర్‌గా విధినిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2000లో మోటార్ ఉమెన్‌గా గౌరవం పొందారు. 2010లో ఘాట్ సెక్షన్‌లో రైలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తరువాత పుణే–ముంబై నగరాల మధ్య నడుస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు లోకోపైలట్‌గా ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడంలో కూడా సఫలీకృతం కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Ashwin: టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్‌లో అశ్విన్ ‘టాప్’
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన టాప్ ర్యాంక్‌ను పటిష్టం చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఆసీస్‌తో ‘డ్రా’గా ముగిసిన నాలుగో టెస్ట్‌లో అశ్విన్ 91 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. గతవారం జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన అశ్విన్ తాజా ప్రదర్శనతో అండర్సన్‌ను రెండో ర్యాంక్‌కు నెట్టేసి ఒంటరిగా టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
RBI Governor Shaktikanta Das: శక్తికాంత్‌కు ‘2023 సెంట్రల్ బ్యాంకర్’ అవార్డు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు’ లభించింది. మహమ్మారి కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకుగాను ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంతదాస్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. భారత దేశం నుంచి 2015లో మొట్టమొదటిసారి అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈ అవార్డు దక్కింది. కీలక సమయాల్లో గవర్నర్ శక్తికాంతదాస్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తాజాగా పేర్కొంది. పేమెంట్ వ్యవస్థసహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపింది. కరోనా మహమ్మారిని ప్రస్తావిస్తూ, కీలక సవాలును భారత్ ఎదుర్కొనగలిగినట్లు పేర్కొంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
Potti Sriramulu: ఆధునిక శిబిచక్రవర్తి అమరజీవి.. నేడు పొట్టి శ్రీరాములు జయంతి
అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో మహా లక్ష్మమ్మ, పొట్టి గురవయ్య దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీరాములు తల్లి దగ్గరే నలుగురి సంతానంలో ఒకడిగా పెరిగాడు. శ్రీరాములు జీవించిన 52 ఏళ్లలో తొలి 20 ఏళ్ళు మద్రాసులోనే ఉన్నారు. శ్రీరాములు ఫిఫ్త్ ఫార్మ్ వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్స్యులర్ రైల్వే (ప్రస్తుత సెంట్రల్ రైల్వే)లో అసిస్టెంట్ ప్లంబర్‌గా ఉద్యోగం పొందారు. శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ పిల్లాడు ఐదు రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయ రోగంతో సీతమ్మ మరణించింది. ఇలా వరుసగా తీరని విషాదాలను ఎదుర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి..? ఏఏ రోజు ఎలా జరుపుకుంటారో తెలుసా మీకు..?
National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం.. నేడు జాతీయ టీకా దినోత్సవం
ప్రతి సంవత్సరం మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం లేదా జాతీయ రోగనిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత ప్రభుత్వం టీకాలు తీసుకోవటం వల్ల కలిగే లాభాలు, దాని ప్రాముఖ్యతను ప్రజలందరికీ అవగాహణ కల్పించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మొదట 16 మార్చి 1995న దేశవ్యాప్తంగా జోనస్ సాల్క్‌ను కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా ‘ఓరల్ పల్స్ పోలియో డ్రైవ్’ ప్రారంభమైంది. దీనికి గుర్తుగా ప్రతియేడాది 16 మార్చిన జాతీయ టీకా దినం (నేషనల్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ డే)ను పాటించుట ఆనవాయితీగా మారింది. 2014 మార్చి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) భారత దేశంతో పాటు ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని 11 దేశాల్లో పోలీయో పూర్తిగా నివారణ జరిగినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
International Womens Day: జయహో.. జనయిత్రీ