మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు
Sakshi Education
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో గూడ్స్ గార్డుగా ఓ మహిళను నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
మాధవికి శిక్షణ ఇప్పించి వర్కింగ్ ఆర్డర్ అందజేశామని కాజీపేట రైల్వే ఏరియా ఆఫీసర్ పూర్ణచంద్రరావు తెలిపారు., కాజీపేట నుంచి సనత్‌నగర్ వెళ్లే యూటీసీఎం గూడ్స్ గార్డుగా ఆమె వెళ్లినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి ఒక్కరే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవిని పలువురు అధికారులు అభినందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు నియమాకం
ఎవరు : మాధవి
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు నియమాకం
ఎవరు : మాధవి
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో
Published date : 14 Mar 2019 07:57PM