మోటారు వాహనాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Sakshi Education
రోడ్డు రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2019ని రాజ్యసభ జూలై 31న ఆమోదించింది.
రవాణా వ్యవస్థలో అవినీతిని తొలగించడం, ప్రయాణికుల, వాహనదారుల భద్రతను మెరుగుపర్చడం, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సాంకేతికతను ఉపయోగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలు. ఈ బిల్లును జూలై 23న లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రోడ్డు రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రోడ్డు రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు
Published date : 01 Aug 2019 05:55PM