Skip to main content

మోటార్ వాహనాల చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్? దాని ఉద్దేశం?

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో ‘మోటార్ వాహనాల(సవరణ) చట్టం-2019’లో కొత్తగా ‘సెక్షన్ 134ఏ’ ను కేంద్ర ప్రభుత్వం చేర్చింది.
Current Affairs
దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం అందించే వారిని వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సహాయం అందించే వారు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. విచారణ పేరిట వారిని ఎవరూ వేధించరు.

పంట వ్యర్థాల డీకంపోజ్‌కు కొత్త విధానం
పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీ, దాని ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మోటార్ వాహనాల(సవరణ) చట్టం-2019లోకి సెక్షన్ 134ఏ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో
Published date : 02 Oct 2020 05:27PM

Photo Stories