Skip to main content

మోంటెకార్లో చాంపియన్‌గా ఫాగ్‌నిని

మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్‌లో చాంపియన్‌గా ఇటలీ ప్లేయర్ ఫాబియో ఫాగ్‌నిని నిలిచాడు.మొనాకోలో ఏప్రిల్ 21న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫాగ్‌నిని 6-3, 6-4తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పైగెలుపొందాడు.
దీంతో ఫాగ్‌నిని తన కెరీర్‌లో తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నట్లయింది. విజేతకు 9,58,055 యూరోలు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్ చాంపియన్
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ఫాబియోఫాగ్‌నిని
ఎక్కడ : మొనాకో
Published date : 22 Apr 2019 06:03PM

Photo Stories